One Plus 15 5G భారతదేశంలో ధర, లాంచ్ తేదీ, మొబైల్ డిజైన్, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

By Damodar Mandala

Updated On:

OnePlus15 5G

Join WhatsApp

Join Now

OnePlus 15 5G అక్టోబర్‌లో అధికారికంగా రానుందని, ఇది OnePlus 13s కి నెక్స్ట్ జనరేషన్ వేరియెంట్ గా  భావిస్తున్నారు. ఈ లాంచ్‌కి ముందుగానే భారత్‌లో జరిగిన స్నాప్ డ్రాగన్ సమ్మిట్ గ్లోబల్ హైలైట్స్ మీట్ ( Snapdragon Summit Global Highlights Meet ) లో ఈ హ్యాండ్‌సెట్‌ను బహిరంగంగా ప్రదర్శించారు. వన్ ప్లస్ ఇండియా సి.ఈ.ఓ( OnePlus India CEO ) రాబిన్ లియూ స్టేజ్‌పైకి వచ్చి రాబోయే స్మార్ట్‌ఫోన్‌ మోడల్ ని ఫస్ట్ టైం చూపించారు. దీంతో OnePlus15 లేటెస్ట్ మొబైల్  కోసం నెట్టింట  రూమర్స్ చెలరేగుతూనే ఉన్నాయి.

కానీ  గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్‌ల కోసం మాత్రం, గత సంవత్సరం ట్రెండ్స్ ప్రకారం, 2026 జనవరి వరకు వేచి చూడాల్సి రావచ్చు. అప్పుడు మాత్రమే మనం కొత్త OnePlus ఫ్లాగ్‌షిప్‌ను చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

OnePlus ఇటీవల హవాయి ( Hawai) లో ముగిసిన స్నాప్ డ్రాగన్  సమ్మిట్ (Snapdragon Summit )లో అధికారికంగా OnePlus 15 ను ప్రకటించింది. ఆ ఈవెంట్ లో, చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు  క్వాల్‌కామ్ (Qualcomm) యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5 ను మొదటగా ఈ ఫోన్‌లో అమర్చబడ్డదని కూడా నిర్ధారించింది.

Also Read : i Phone 16 Pro ను ధర ₹57,000 కే కొనండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 , iPhone 16 Pro పై భారీ ఆఫర్!

OnePlus 15 5G మొబైల్ :  డిజైన్ మరియు డిస్‌ప్లే 

రాబోయే డివైస్ గురించి ఇంకా ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు కానీ OnePlus 15 మొబైల్ డిజైన్ తాజాగా ఆన్‌లైన్‌లో బయటకు వచ్చింది, ఇందులో రీడిజైన్ చేసిన రియర్ ప్యానెల్‌ను చూపించారు.  OnePlus 15 మొబైల్ ముందరి భాగంలో 6.82-inch LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే తో, వంకర ఎడ్జ్‌లతో మరియు 1.15mm సన్నని బీజెల్‌లతో రావచ్చును. మరియు ఈ డిస్‌ప్లే 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుందట .  ఇది గత మోడళ్లలో వున్న 120Hz ప్యానెల్‌తో పోలిస్తే ఒక పెద్ద అప్‌గ్రేడ్‌గా నిలుస్తుంది. దీని వల్ల గేమింగ్‌లో అధిక ఫ్రేమ్‌రేట్లు సాధ్యమవుతాయి.

OnePlus ప్రాచీన సర్కులర్ ఐలాండ్ డిజైన్‌ను వదిలేస్తోందని కనిపిస్తోంది. దాని స్థానంలో, వెర్టికల్‌గా సవరించిన కెమెరా ఐలాండ్ కలిగిన కొత్త బ్యాక్ ప్యానల్‌ను తీసుకురాగలదు, ఇందులో మూడు లెన్స్‌లు ఉన్నాయి. మీరు చిత్రంలో చూస్తున్నట్లే, OnePlus 15 కంపెనీ కొత్త కాంపాక్ట్ Android ఫోన్ OnePlus 13s  కు దగ్గరగా ఉన్నట్లుంది, మధ్యలో ఫేమస్ OnePlus లోగో పెట్టబడింది.

OnePlus 15 5G మొబైల్ : కెమెరా

కెమెరా డిజైన్ మాత్రం  OnePlus 13s మోడల్‌కి చాలా దగ్గర గా డిజైన్ చేసారు , ఎందుకంటే ఈ డిజైన్‌ను చాలా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇష్టపడ్డారు.  కంపెనీ స్వంతంగా అభివృద్ధి చేసిన DetailMax ఇమేజ్ ఇంజిన్‌ను ఫీచర్ నీ ఈ మొబైల్ లో ఫోటో క్యాప్ట్యూరింగ్ కోసం ఉపయోగిస్తుందట.

OnePlus 15 5G లో త్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చని అంచనా. దీని‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉండవచ్చును. 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండవచ్చనే రూమర్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ అంచనాలను అధికారికంగా ధృవీకరించడానికి లాంచ్ వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

OnePlus 15 5G మొబైల్ : పెర్ఫార్మెన్స్ మరియు బ్యాటరీ

OnePlus 15 మొబైల్  చైనాలో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో రాబోతుందని ఇప్పటికే  ధృవీకరించారు.  ఇది క్వాల్‌కామ్( Qualcomm ) యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ మొబైల్ చిప్‌సెట్‌గా నిలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ను TSMC యొక్క 3nm (N3P) ప్రాసెస్‌తో తయారు చేశారు. 64 బిట్ ఆర్కిటెక్చర్‌తో వచ్చిన ఈ సిస్టం ఆన్ చిప్ (SOC), గతంలో చిప్సెట్  కంటే 23 శాతం మెరుగైన పనితీరును మరియు 20 శాతం ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

అంతేకాకుండా Android 16 ఆధారంగా OxygenOS 16 తో రాబోతుందని అంచనా, అలాగే 5 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ అందవచ్చని భావిస్తున్నారు. అందుచేత  మొబైల్  పనితీరు మెరుగుదల మరియు అధిక AI ఇంటిగ్రేషన్‌ను ఆశించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16GB వరకు RAM మరియు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చును. OxygenOS 16 (Android 16 ఆధారంగా) పై రన్ అవ్వడం వల్ల కొత్త UI ఫీచర్లు మరియు AI అప్‌గ్రేడ్లు లభిస్తాయి. One Plus 15 5G మొబైల్ ఎక్కువ టైం యూస్ కి వీలుగా  7000mAh సిలికాన్-కార్బన్  భారీ బ్యాటరీతో రాబోతుందని, 50W వైర్‌లెస్ మరియు 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుందని చెబుతున్నారు.

OnePlus 15 5G మొబైల్ : ధర భారత్‌లో

OnePlus 15 స్మార్ట్ ఫోన్ , గత ట్రెండ్స్ ప్రకారం, భారత్‌లో సుమారు రూ. 70,000 వద్ద లాంచ్ కావచ్చునని అంచనా. ఇప్పటివరకు ఫ్లాగ్‌షిప్ మోడల్ కోసం ఎలాంటి ధర పెరుగుదల రిపోర్ట్ అవ్వలేదు. కాబట్టి, దీన్ని OnePlus 13 మోడల్‌తో సమానంగా ధర వేసే అవకాశం ఉంది.

స్నాప్ డ్రాగన్ సమ్మిట్ (Snapdragon Summit‌) లో, iQOO, Vivo, Xiaomi మరియు ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా త్వరలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో నడిచే కొత్త ఫోన్లు లాంచ్ చేయబోతున్నారని నిర్ధారించారు.

FAQs

 Q1: OnePlus 15  భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
 A: OnePlus 15 5G యొక్క అధికారిక లాంచ్ తేదీ ఇంకా కంపెనీ ద్వారా ప్రకటించబడలేదు, కానీ 2025 చివరి త్రైమాసికంలో రావచ్చని అంచనా.
 
Q2:OnePlus 15  ధర ఎంత ఉంటుంది?
 A:ధర ఇంకా అధికారికంగా లభించలేదు. అంచనాలు ప్రకారం ₹50,000 – ₹60,000 మధ్య ఉండవచ్చు.
 
Q3:OnePlus 15 5G లో ఎలాంటి డిజైన్ ఫీచర్లు ఉంటాయి?
 A:6.82-inch LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే తో, వంకర ఎడ్జ్‌లతో మరియు , కొత్త కెమెరా మోడ్యూల్, మరియు మల్టీ కలర్ వేరియంట్స్ ఉంటాయి.
 
Q4:OnePlus 15  స్పెసిఫికేషన్లు ఏమిటి?
 A:Snapdragon 8 Elite Gen 5 Processor, 16GB RAM, 512GBStorage,  6.82-inch LTPO AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే ,7000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ, 50W వైర్‌లెస్ మరియు 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్.
 
Q5:OnePlus 15 లో ముఖ్యమైన ఫీచర్స్ ఏవీ?
 A:5G కనెక్టివిటీ, Super Fast Charging, Multi-Camera Setup, OxygenOS latest version.
 
Q6:OnePlus 15  pre-orders ఎప్పుడు ప్రారంభమవుతాయి?
A:లాంచ్ తరువాత కొన్ని రోజుల్లో pre-orders ప్రారంభమవుతాయి. అధికారిక update కోసం OnePlus website  చూడాలి.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment