Oppo F31 5G సిరీస్ : ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ మూడు రకాల IP రేటింగ్స్‌తో పాటు, మన్నికైన డ్యూరబుల్ బిల్డ్‌ను కలిగి ఉంది.

By Damodar Mandala

Published On:

Oppo F31 Pro+ 5G mobile review

Join WhatsApp

Join Now

స్మార్ట్‌ఫోన్ అంటే ఒకప్పుడు చాలా నాజూకుగా ఉండి జాగ్రత్తగా మాత్రమే ఉపయోగించుకోవాల్సిన గాడ్జెట్లు గా పరిగణించబడేవి , కాని ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా  స్మార్ట్ ఫోన్ కంపెనీ లన్ని మొబైల్ డ్యూరబిలిటీ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించాయి. ఈ రోజు మార్కెట్లో ఉన్న అత్యంత ప్రీమియం హ్యాండ్స్‌లలో డ్యూరబిలిటీ రేటింగ్  IP69+  వరకు ఉంటుంది, ఇది హై-ప్రెషర్ వాటర్ జెట్లు నుండి రక్షణ అందిస్తుంది అని మొబైల్ కంపెనీలు చెప్తాయి. నిజానికి, వినియోగదారులలో డ్యూరబిలిటీ పై ఆందోళన పెరుగుతోంది. అయితే OPPO F31 5G  సిరీస్‌ ఇలాంటి అన్ని డౌట్స్ కి చెక్ పెట్టేలా Oppo Company  తయారు చేసింది. 

కౌంటర్  పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, 78 శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ ని వాటర్ , ఆయిల్ వంటి  హార్ష్ కండిషన్స్‌లో ఉపయోగించడం లో భయపడుతున్నారు అని వారి నివేదిక ద్వారా చెప్పుకొచ్చారు . ఈ సమస్యను కొత్త Oppo F31 Pro 5G ప్రత్యేకంగా పరిష్కరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

Oppo-F31-5G mobile
Oppo F31 5G image Credit : Oppo

Oppo F31 5G సిరీస్ : మొబైల్ డ్యూరబిలిటీ

Oppo భారత మార్కెట్‌లో మూడు కొత్త F సిరీస్ మోడల్స్‌ను లాంచ్ చేసింది. అవి  Oppo F31 5G, Oppo F31 Pro 5G, మరియు Oppo F31 Pro+ 5G. ఈ స్మార్ట్‌ఫోన్లు మూడురకాల IP రేటింగ్స్‌ ( IP66, IP68, IP69 )తో పాటు, డస్ట్‌, నీరు, అధిక పీడన జెట్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయట. టీ, కాఫీ, జ్యూస్, డిటర్జెంట్‌ వాటర్‌, వేడి నీరు వంటి 18 రకాల ద్రవాల నుంచి కూడా ఫోన్‌ను సేఫ్‌గా కాపాడుతాయి.  ఈ మొబైల్ లోప్రత్యేకంగా ఉన్న ఇక్వలైజేషన్‌ మెంబ్రేన్‌ ద్రవ వేగాన్ని నియంత్రించి, అంతర్గత గాలి పీడనాన్నిసమం చేస్తుంది. అంతేకాక, ఫోన్ నీటిలో మునిగినా ఆందోళన అవసరం లేదు, ఎందుకంటే స్పీకర్ డ్రైనేజ్ సిస్టమ్ వెంటనే నీటిని బయటకు పంపించి ఫోన్ పనితీరును నిలబెట్టుతుంది.

Oppo F31 5G సిరీస్ ఫోన్లు మరింత మన్నికగా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి.  ఈ  మొబైల్ లో సున్నితమైన, క్లిష్టమైన విభాగాల చుట్టూ మల్టీ లేయర్ ఎయిర్‌బ్యాగ్ కుషనింగ్‌తో కూడిన 360 డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉండటంతో, పొరపాటున కింద పడినా డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తాయి.

అదనంగా ఏరోస్పేస్‌ గ్రేడ్ AM04 అల్లాయ్ ఫ్రేమ్ మరింత దృఢత్వాన్ని అందిస్తే, స్క్రీన్‌ ప్రొటెక్షన్‌  గ్లాస్ ( AGC DT-Star D+  ) స్క్రాచ్ లని తట్టుకుని ఇంపాక్ట్ రెసిస్టెన్స్‌ను మెరుగుపరుస్తుంది. ఈ సిరీస్ ఫోన్లు MIL STD 810H మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందాయి. దీని ద్వారా అధిక వేడి, అధిక చలి, వైబ్రేషన్, డస్ట్, షాక్ వంటి కఠిన పరిస్థితుల్లో కూడా రక్షణ పొందుతాయి . 

also Read : Oppo Reno 14 5G Diwali Edition 2025: అద్భుతమైన గ్లో షిఫ్ట్ డిజైన్ ఫీచర్ , కెమెరా, బ్యాటరీ & స్పెషల్ ఆఫర్లు

Oppo F31 5G సిరీస్ : డిస్ ప్లే  

ఒప్పో F31 ఫోన్‌ డిస్ ప్లే  6.57 అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉండి, హై బ్రైట్‌నెస్1400 నిట్స్‌ వరకు చేరుతుంది. రిజల్యూషన్‌ 1080 x 2372 పిక్సెల్స్‌ కలిగి ఉండటంతో విజువల్స్‌ క్లారిటీగా కనిపిస్తాయి. ఫోన్‌ సైజు సుమారు 15.82cm x 7.50cm x 0.80cm ఉండి, బరువు దాదాపు 185 గ్రాములు ఉంటుంది. కలర్స్‌ విషయానికి వస్తే, ఇది మిడ్‌నైట్‌ బ్లూ, క్లౌడ్‌ గ్రీన్‌ మరియు బ్లూమ్‌ రెడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Oppo F31 pro 5G ఫోన్‌ డిస్‌ప్లే సైజు 6.57 అంగుళాలు . ఇందులో Adaptive AMOLED ప్యానెల్‌ని ఉపయోగించారు. రిజల్యూషన్‌ 2372 x 1080 (FHD+) ఉండి, స్పష్టమైన విజువల్స్‌ అందిస్తుంది. రిఫ్రెష్‌ రేట్‌ 60Hz/90Hz/120Hz లకు అడాప్టివ్‌గా సపోర్ట్‌ చేస్తుంది. హై బ్రైట్‌నెస్‌ మోడ్‌లో హై బ్రైట్‌నెస్ 1400 నిట్స్‌ వరకు చేరుతుంది. స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ కోసం DT Star D+ కవర్‌ గ్లాస్‌ ఉపయోగించారు . ఈ డిస్‌ప్లే 10-bit ( 1.07 బిలియన్‌ కలర్స్‌)  సపోర్ట్‌ చేయగలదు.

Oppo F31 Pro+ 5G  ఫోన్‌లో మాత్రం 6.79 అంగుళాల AMOLED ఫ్లెక్సిబుల్ స్క్రీన్‌ ఉంటుంది. రిజల్యూషన్‌ 2800 x 1280  పిక్సెల్స్‌ తో వస్తూ, క్వాలిటీ విజువల్స్‌ను అందిస్తుంది. రిఫ్రెష్ రేట్‌ 120Hz సపోర్ట్ చేస్తుంది. బ్రైట్‌నెస్‌ విషయానికి వస్తే, హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 1600 నిట్స్‌ వరకు చేరుతుంది. డైమెన్షన్స్‌ సుమారు 163.1 x 77.6 x 7.7 mm గా ఉండి, స్లిమ్‌ మరియు కాంపాక్ట్ డిజైన్‌ కలిగి ఉంటుంది. బరువు కలర్‌ ఆధారంగా మారుతుంది.  జెమ్ స్టోన్ బ్లూ మోడల్‌ సుమారు 195 గ్రాములు ఉండగా, హిమాలయన్ వైట్  మరియు ఫెస్టివల్ పింక్ మోడల్స్‌ దాదాపు 204 గ్రాముల బరువు కలిగి ఉంటాయి.

Oppo F31 5G సిరీస్ : ప్రాసెసర్‌

ఒప్పో F31 ఫోన్‌  మీడియా టెక్ డిమెన్షిటీ ( MediaTek Dimensity )6300 ఎనర్జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో  64-bit ఆక్టా కోర్‌ CPU వుంది , Mali-G57 MC2 GPU తో కలిసి  శక్తివంతమైన గ్రాఫిక్స్‌ పనితీరును అందిస్తుంది. రేమ్  విషయానికి వస్తే, 8GB  ఇంటర్నల్ స్టోరేజ్‌ 128GB లేదా 256GB వేరియంట్స్‌లో లభిస్తుంది అదనంగా microSD కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ని 1TB వరకు విస్తరించుకోవచ్చు.

అలానే  Oppo F31 Pro 5G ఫోన్‌ టెక్ డిమెన్షిటీ  7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది కూడా  ఆక్టా కోర్‌ CPU మరియు Mali-G615 GPU తో వస్తుంది . స్టోరేజ్‌ మరియు రేమ్ విషయానికి వస్తే ఈ ఫోన్‌ 8GB లేదా 12GB  రేమ్ పాటు 128GB లేదా 256GB (UFS 3.1) స్టోరేజ్‌ ఆప్షన్లలో లభిస్తుంది.

Oppo F31 Pro+ 5G ఫోన్‌  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్7 జెన్ 3  ( Qualcomm Snapdragon 7 Gen 3) ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 4nm ప్రాసెస్‌పై నిర్మించబడిన ఆక్టా కోర్‌ చిప్‌సెట్‌ కావడంతో వేగవంతమైన మరియు స్మూత్‌ పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌ 8GB లేదా 12GB రేమ్ తో రెండు వేరియంట్స్‌  256GB (UFS 3.1 ) ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ పరంగా, ఈ ఫోన్‌ Android 15 ఆధారంగా రూపొందించబడిన ColorOS 15 పై నడుస్తుంది. ఈ  వేరియెంట్  లో పెద్ద  వెపర్ చాంబర్ (VC) హీట్ స్ప్రెడ్ర్ ను అంటే  సూపర్ కూల్ VC సిస్టమ్ అమర్చారు. ఇది ఫోన్లో వేడిని తగ్గించడానికి  సహాయపడుతుంది.

Oppo F31 Pro 5G mobile
Oppo F31 Pro 5G image Credit :Oppo

Oppo F31 5G సిరీస్ : బ్యాటరీ మరియు ఛార్జింగ్

ఒప్పో  F31  5G  సిరీస్ 3 మొబైల్ ఫోన్‌లలో 7,000mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీనే అందించారు. చార్జింగ్‌ విషయానికి వస్తే, 80W (SUPER VOOC) ఫ్లాష్‌ ఛార్జ్‌ టెక్నాలజీని సపోర్ట్‌ చేస్తుంది. OPPO అధికారిక సమాచారం ప్రకారం, ఈ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో బ్యాటరీని 1% నుంచి 55% వరకు కేవలం 30 నిమిషాల్లో, అలాగే పూర్తి 100% ఛార్జ్‌ను దాదాపు 60 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.

Oppo F31 5G సిరీస్ : కెమెరా ఫీచర్స్ 

Oppo F31 5G లో డ్యూయల్ కెమెరా సెటప్  ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి వుంది.  
మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ర్‌ కెమెరా  ఉంటాయి  సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా ఉంది.  F31 Pro మరియు F31 Pro + మొబైల్లో కూడా  50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ర్‌ కెమెరా ఉంటాయి ఫ్రంట్ కెమెరా మాత్రం  32 మెగాపిక్సెల్ మార్చారు. Ai ఫీచర్స్ , లో లైట్ ఫోటోగ్రఫీ సపోర్ట్ ఇచ్చారు.

Oppo F31 5G సిరీస్ : ధర మరియు  అందుబాటు  
OPPO F31 5G

8GB రేమ్ + 128GB స్టోరేజ్: సుమారు ₹22,999
8GB రేమ్ + 256GB స్టోరేజ్: సుమారు ₹24,999

OPPO F31 Pro 5G

8GB రేమ్ + 128GB స్టోరేజ్: సుమారు ₹26,999
8GB రేమ్ + 256GB స్టోరేజ్: సుమారు ₹28,999
12GB రేమ్ + 256GB స్టోరేజ్: సుమారు ₹30,999

OPPO F31 Pro+ 5G

8GB రేమ్ + 256GB స్టోరేజ్: సుమారు ₹32,999
12GB రేమ్ + 256GB స్టోరేజ్: సుమారు ₹34,999

అక్టోబర్‌ 31, 2025 వరకు మాత్రమే వున్న పండుగ ఆఫర్‌లో OPPO F31 సిరీస్‌ను రూ.20,700 ప్రారంభ ధరకే  కొనుగోలు  చేసుకోవచ్చు. SBI, ICICI  బ్యాంకు కార్డులపై 10% క్యాష్‌బ్యాక్, పాత స్మార్ట్‌ఫోన్‌లపై 10% ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ నోకాస్ట్ EMI వంటి ఆప్షన్లూ అందుబాటులో ఉన్నాయి. ఈ పండుగ ఆఫర్‌తో OPPO F31 ప్రో మరియు F31 మోడల్స్ రూ.30,000 ధర సెగ్మెంట్‌లోకి వస్తాయి, కానీ ప్రీమియం మిడ్ రేంజ్ లో OPPO F31 Pro+ మోడల్ మీకు మంచి  ఆప్షన్ అవుతుంది.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment