ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపులు ఎలా చేయాలి?

By Damodar Mandala

Updated On:

UPI PAYMENT WITHOUT INTERNET

Join WhatsApp

Join Now
ఇంటర్నెట్ అనేది ఆధునిక డిజిటల్ చెల్లింపులలో ఒక ముఖ్యమైన భాగం. కానీ ప్రతి సందర్భంలో మనకు ఇంటర్నెట్ లభించకపోవచ్చు. ఈ సందర్భంలో కూడా మనం UPI ద్వారా చెల్లింపులు చేయగలమా? అవును ప్రతి బ్యాంక్ ఖాతాదారు ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. బ్యాంక్‌ కి రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ ద్వారా *99# డయల్‌ చేస్తే సరిపోతుంది. ఇది NPCI (National Payments Corporation of India) ప్రవేశపెట్టిన USSD ఆధారిత సర్వీస్, దీని ద్వారా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సులభంగా డబ్బు పంపడం లేదా స్వీకరించడం సాధ్యమవుతుంది.
 
ఈ సేవ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు లేదా నెట్‌ కనెక్షన్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్‌లో ఆఫ్‌లైన్‌ యూపీఐ ఎలా సెటప్‌ చేయాలి,అలాగే ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ పేమెంట్‌ ఎలా చేయాలి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
దానికి ముందుUPI అంటే తెలుసుకోవాలి?
UPI అంటే యూనిఫైడ్ పెమెంట్స్ ఇంటర్ఫేస్ (Unified Payments Interface), ఇది బ్యాంక్ ఖాతాలను కనెక్ట్ చేసి, రియల్ టైం లో మనీ డెబిట్ లేదా క్రెడిట్ చేయగల డిజిటల్ చెల్లింపు సిస్టమ్. సాధారణంగా మనం యూపీఐ యాప్‌లు (Paytm, Google Pay, PhonePe, BHIM) ద్వారా ఇంటర్నెట్ ద్వారా చెల్లింపులు చేస్తాము. కానీ *99# సేవ ద్వారా మనం ఇంటర్నెట్ లేకుండా కూడా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.
 
అందుకు ఉపయోగించే టెక్స్ట్ బేస్డ్ ఇంటరాక్టివ్ మెసేజ్ సర్వీస్ ని  USSD అంటారు.USSD అంటే అన్ స్ట్రక్చరేడ్  సప్లిమెంటరీ సర్వీస్ డేటా ( Unstructured Supplementary Service Data). ఇది సింపుల్ టెక్స్ట్ బేస్డ్ ఇంటరాక్టివ్ మెసేజ్ సర్వీస్, ఇది మీరు డయల్ చేసే *99# నంబర్ ద్వారా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. మీ మొబైల్ సిమ్ బ్యాంక్ అకౌంట్ తో కనెక్ట్ అయి ఉండాలి, మరియు మీరు ఒక సింపుల్ మెసేజ్ ద్వారా ఆప్షన్‌లను సెలెక్ట్ చేయవచ్చు.
 

Offline UPI Payment Number అంటే ఏమిటి?

ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకుండానే UPI సర్వీస్‌ ఉపయోగించాలంటే *99# నంబర్‌ డయల్‌ చేయాలి. ఇది ఆఫ్‌లైన్‌ యూపీఐ పేమెంట్‌ నంబర్. ఈ సర్వీస్‌ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది . అంతేకాదు  83 బ్యాంకులు అలాగే 4 టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు దీనికి అనుసంధానమయ్యి ఉన్నాయి.ఈ సర్వీస్‌ను మీరు మీకు సౌకర్యంగా ఉన్న భాషలో కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్‌, హిందీతో పాటు మొత్తం 13 భాషల్లో అందుబాటులో ఉంది. అందువల్ల దేశంలోని ప్రతి యూజర్‌ సులభంగా Offline UPI పేమెంట్స్‌ చేయగలరు.
 

NPCI పరిచయం చేసిన *99# సర్వీస్ అంటే ఏమిటి?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దేశంలోని పలు బ్యాంకుల మధ్య ఆఫ్లైన్‌ యూపీఐ ట్రాన్సాక్షన్ లను  సులభం చేయడానికి *99#  సర్వీస్‌ను ప్రారంభించింది. మీరు చేయాల్సిందల్లా ! మీ బ్యాంక్‌కి రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ నుండి *99# డయల్‌ చేయడం మాత్రమే. దాంతో మీ మొబైల్‌ స్క్రీన్‌పై ఒక ఇంటరాక్టివ్‌ మెను కనిపిస్తుంది, దానిలోని ఆప్షన్లతో మీరు డబ్బు పంపించవచ్చు లేదా స్వీకరించవచ్చు.
 
ప్రస్తుతం ఈ ఆఫ్లైన్‌ యూపీఐ ట్రాన్సాక్షన్‌లకు గరిష్ట పరిమితి ₹5,000 గా నిర్ణయించబడింది. అంతే కాదుప్రతి ట్రాన్సాక్షన్‌కి ₹0.50 సర్వీస్‌ చార్జ్‌ కూడా వర్తిస్తుంది. ఈ విధంగా NPCI అందిస్తున్న ఈ సేవ ద్వారా, ఇంటర్నెట్‌ లేకుండా కూడా సురక్షితంగా మరియు వేగంగాయూపీఐ పేమెంట్స్‌ చేయవచ్చు.
 
 

ఆఫ్‌లైన్ UPI పేమెంట్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి?

మీరు ఆఫ్‌లైన్‌ యూపీఐ లావాదేవీలు చేయాలంటే, ముందుగా మీ ఫోన్‌లో ఏ ఆప్షన్‌ను సెట్‌ చేయాలి. దీని కోసం మీరు అనుసరించాల్సిన స్టెప్‌ బై స్టెప్‌ గైడ్‌ ఇక్కడ ఉంది.

  • ముందుగా మీ ఫోన్‌ డయలర్‌ ఓపెన్‌ చేసి *99# డయల్‌ చేయండి. ఇది ఆఫ్‌లైన్‌ యూపీఐ లావాదేవీలు మరియు ఇతర ఫీచర్లను యాక్సెస్‌ చేయడానికి ఉపయోగపడుతుంది.
  • తరువాత, మీరు ఉపయోగించదలచిన భాషను ఎంచుకోమని అడుగుతారు. అందుబాటులో ఉన్న 13 భాషలలో మీకు ఇష్టమైనదాన్ని ఎంచుకోండి.
  • ఆ తరువాత, మీ బ్యాంక్‌ యొక్క IFSC కోడ్‌ను ఎంటర్‌ చేయండి.
  • మీరు స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తుంటే, మీ మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయిన అన్ని బ్యాంక్‌ ఖాతాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీరు కావలసిన బ్యాంక్‌ ఖాతాను 1, 2 లేదా ఇతర ఆప్షన్‌ ద్వారా ఎంచుకోండి.
  • తరువాత, మీరు డెబిట్‌ కార్డ్‌ చివరి ఆరు అంకెలు మరియు గడువు తేదీ (expiry date) ఎంటర్‌ చేయాలి. ఇది వెరిఫికేషన్‌ కోసం అవసరం.
  • మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే, ఆఫ్‌లైన్‌ యూపీఐ పేమెంట్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ అవుతుంది.
  • ఇకమీదట, మీరు సులభంగా *99# USSD కమాండ్‌ ద్వారా ఇంటర్నెట్‌ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు
ఆఫ్‌లైన్‌ UPI పేమెంట్‌ ఎలా చేయాలి?

ఆఫ్‌లైన్‌ UPI పేమెంట్‌ చేయడానికి మీకు మొబైల్‌ డేటా లేదా ఇంటర్నెట్‌ అవసరం లేదు. కింది స్టెప్స్‌ అనుసరించడం ద్వారా మీరు ఈ లావాదేవీని సులభంగా పూర్తి చేయవచ్చు:

UPI PAYMENT WITHOUT INTERNET Picture 01

  1. ముందుగా మీ ఫోన్‌ డయలర్‌ ఓపెన్‌ చేసి, మీ బ్యాంక్‌ రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ ద్వారా *99# డయల్‌ చేయండి.
  2. స్క్రీన్‌పై కనిపించే మెను నుండి “1” ఎంపికను ఎంచుకోండి . ఇది “Send Money” (డబ్బు పంపడం) ఆప్షన్‌.

UPI PAYMENT WITHOUT INTERNET Picture 02

  1. తరువాత, మీరు డబ్బు పంపదలచిన వ్యక్తి యొక్క యూపీఐ ID, మొబైల్‌ నంబర్‌ (UPIతో లింక్‌ అయినది) లేదా బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ మరియు IFSC కోడ్‌ ఎంటర్‌ చేయండి.
  2. యూపీఐ కి లింక్ అయిన అకౌంట్ హోల్డర్ నేమ్ కనిపిస్తుంది.  చెక్ చేయండి.

UPI PAYMENT WITHOUT INTERNET Picture 03

  1. ఇప్పుడు మీరు పంపదలచిన డబ్బు మొత్తాన్ని టైప్‌ చేయండి. గమనిక: NPCI నియమాల ప్రకారం, మొత్తం ₹5,000 లోపు ఉండాలి.
  2. చివరగా, మీ యూపీఐ PIN ఎంటర్‌ చేసి లావాదేవీని కన్ఫర్మ్‌ చేయండి. ఇంతటితో మీ ఆఫ్‌లైన్‌ యూపీఐ పేమెంట్‌ పూర్తి అవుతుంది.

FAQ

Q1: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేయడం సాధ్యమేనా?
A1: అవును. *99# USSD సర్వీస్ ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా యూపీఐ  ద్వారా డబ్బు పంపడం మరియు స్వీకరించడం చేయవచ్చు. ఇది NPСI ప్రవేశపెట్టిన ఆఫ్‌లైన్ UPI సర్వీస్.

Q2: *99# USSD సర్వీస్ అంటే ఏమిటి?
A2: USSD అంటే Unstructured Supplementary Service Data. *99# డయల్ చేస్తే మీ స్క్రీన్‌పై ఇంటరాక్టివ్ టెక్స్ట్ మెనూ వస్తుంది, దానిలోని ఆప్షన్లతో ఇంటర్నెట్ లేకుండా కూడా యూపీఐ లావాదేవీలు చేయవచ్చు.

Q3: ఆఫ్‌లైన్ UPI ట్రాన్సాక్షన్ పరిమితి ఎంత?
A3: ప్రతి ఆఫ్‌లైన్ UPI ట్రాన్సాక్షన్‌కు గరిష్ట పరిమితి ₹5,000. ప్రతి ట్రాన్సాక్షన్‌కు సర్వీస్ చార్జ్ ₹0.50 ఉంటుంది.

Q4:.ఆఫ్‌లైన్ UPI సెట్‌అప్ చేయడానికి ఏవీ అవసరం?
A4:  step1బ్యాంక్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్,  *99# డయల్ చేయడం,  IFSC కోడ్, డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు మరియు ఎక్స్‌పైరీ తేదీ (వెరిఫికేషన్ కోసం).

Q5. ఆఫ్‌లైన్ UPI ద్వారా డబ్బు ఎలా పంపాలి?
A5: *99# డయల్ చేయండి.“Send Money” ఆప్షన్‌ ఎంచుకోండి.UPI ID / మొబైల్ నంబర్ / బ్యాంక్ అకౌంట్ + IFSC ఎంటర్ చేయండి.
పంపదలచిన మొత్తం టైప్ చేయండి (₹5,000 వరకు).యూపీఐ PIN ఎంటర్ చేసి లావాదేవీ కన్ఫర్మ్ చేయండి.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

🔴Related Post

Leave a Comment