Oppo A5x 5G మొబైల్ వేరియంట్ ల పై దివాళి ఆఫర్ ధమాకా !

By Damodar Mandala

Updated On:

OPPO A5x 5G

Join WhatsApp

Join Now

ఒప్పో నుంచి ఈ సంవత్సరం చాలా మొబైల్స్  లాంచ్ చేసింది. అందులో  ఈ   సంవత్సరం ప్రథమార్ధంలో  మే 16న Oppo A5x 5G ని  భారీ బ్యాటరీ తో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ ప్లే తో బడ్జెట్ రేంజ్ కొనుగోలుదారునికి  వీలుగా అందుబాటులో ఉంచింది .

Oppo A5x 5G : ఈరోజు ఆఫర్స్ 

Oppo A5x 5G స్మార్ట్‌ఫోన్‌ ని విడుదల చేసే  సమయంలో మొబైల్ 4GB రేమ్/128GB స్టోరేజ్  లేసర్ వైట్( Laser White) వేరియంట్  ధర రూ.13,999 గా నిర్ణయించబడింది.
అయితే  ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ ను  డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు  Flipkart లో ప్రత్యేక తగ్గింపు ధర రూ .11,399 గా వుంది . Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించినవారికి  రూ .515  అదనంగా తగ్గింపు ఉంటుంది  . ఎక్స్‌చేంజ్ ఆఫర్లు మీ పిన్ కోడ్ ఆధారంగా మారవచ్చు. చెక్ చేసి ఈ ఫెసివల్ సీజన్లో  మొబైల్ ని తీసుకోండి .
 

 అదే విదంగా ఈ  మొబైల్  6GB రేమ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.13999 కే  కొనుగోలు చేసుకోవచ్చు . ఆఫర్స్ లో మొబైల్ కొనుగోలు చేసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పాలి.  కొనుగోలు చేసే ముందు  ముఖ్యము గా బ్యాంక్ ఆఫర్స్  చెక్ చేసి తీసుకోడం మంచిది.

ఈరోజు OPPO A5x మొబైల్ యొక్క  4GB రేమ్ / 64GB స్టోరేజ్ లేసర్ వైట్ ( Laser White) మరియు మిడ్ నైట్ బ్లూ  ( Midnight Blue) వేరియంట్ల కోసం Flipkart లో ప్రత్యేక తగ్గింపు ధర  రూ .8,928 అందుబాటులో ఉంది.  Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ లేదా   డెబిట్ కార్డ్ లు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేసేవారికి  ₹500 తగ్గింపు కూడా లభిస్తుంది. అదేవిధంగా, ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో అయితే   మొబైల్ రూ. 7,490  కి వస్తుంది 

Oppo A5x 5G : IP65 రేటింగ్  మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 

ఒప్పో A5x 5G ఫోన్‌కు IP65 రేటింగ్ ఉంది. అంటే  మొబైల్ బయట నుంచి లోనికి చొచ్చుకుని పోయే  నీరు మరియు ధూళి నుండి రక్షణ కలిగి ఉంటుందని నిర్ధారించారు . 
అదేవిధంగా, షాక్ రిసిస్టెన్స్ కోసం మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ (MIL-STD 810H మిథడాలజీస్) ని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి వుంది . ఫోన్ ని షాక్ తగిలిన , చేతి నుంచి డ్రాప్ అయిన లేదా వివిధ ఎక్సట్రీమ్  పరిస్ధితులలో కూడా మొబైల్ కి ఏమి కాదు అని ఒప్పో మొబైల్ తయారీ సంస్థ చెప్పుకొచ్చింది.

OPPO A5x 5G IP65 Water and Dust ResistanceDamage Proof
OPPO A5x 5G image credit :Oppo

Oppo A5x 5G :  డిస్ ప్లే  వివరాలు 

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ (1604 x 720 పిక్సెల్) డిస్‌ప్లే ఉంది, ఇది LCD టైప్ డిస్‌ప్లే . ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, అందువల్ల స్క్రోల్, గేమింగ్ మరియు వీడియోలు ఎక్కువ కలర్ ఫుల్ గా కనపడతాయి. అదేవిధంగా హై బ్రైట్ మోడ్ (HBM)లో ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది, కాబట్టి ఎలాంటి వెలుతురు కలిగిన పరిస్థితులలోనైనా ఫోన్ విజువల్స్ స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

Oppo A5x 5G : ప్రాసెసర్ వివరాలు

ఒప్పో A5x 5G ఫోన్‌కు మీడియా టెక్ డిమెన్షిటీ ( MediaTek Dimensity) 6300 ప్రాసెసర్ అమర్చబడి ఉంది. Android 15 ఆధారంగా పనిచేసే  ColorOS 15 తో మొబైల్ రన్ అవుతుంది . RAM కోసం రెండు ఆప్షన్లు ఉన్నాయి  4GB లేదా 6GB. స్టోరేజ్ 128GB (UFS 2.2) అందిస్తుంది, ఇంకా మైక్రో ఎస్డి  ( microSD) కార్డ్ ఉపయోగించి గరిష్టంగా 1TB వరకు పెంచుకో వచ్చును .

also Read: Oppo F31 5G సిరీస్ : ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ మూడు రకాల IP రేటింగ్స్‌తో పాటు, మన్నికైన డ్యూరబుల్ బిల్డ్‌ను కలిగి ఉంది.

Oppo A5x 5G : కెమెరా వివరాలు
ఒప్పో A5x 5G ఫోన్‌లో (రియర్ కెమెరా ) వెనక వైపు  32 మెగాపిక్సల్ వైడ్ ఏంగిల్ కెమెరా అమర్చబడి ఉంది.  అలాగే ఫ్రంట్  5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. రియర్ కెమెరా లో  
ఫోటో, వీడియో, పోర్ట్రెట్, నైట్, PRO, పానోరామా, స్లో మోషన్,  డ్యువల్ వ్యూ వీడియో, టైమ్ లాప్స్, స్టిక్కర్, హైపర్‌టెక్స్ట్,  హై  రెస్ , గూగుల్ లెన్స్ వంటి  షూటింగ్ మోడ్‌లు ఉన్నాయి .
 
అలాగే రియర్ కెమెరా తో 1080p/720p వీడియో30fpsతో మరియు 720p స్లో మోషన్ వీడియో 120fps తో షూట్ చేయవచ్చు, ఫ్రంట్ కెమెరా తో  అయితే  1080p/720p వీడియో30fps వరకు  వీలుంటుంది.
Oppo A5x 5G : బ్యాటరీ వివరాలు
ఈ ఫోన్‌లో 6000mAh టైపికల్ కెపాసిటీ బ్యాటరీ ఉంది, ఎక్కువ సేపు  మొబైల్ ఉపయోగించడానికి ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం  సరిపోతుంది. ఫోన్ 45 వాట్స్  SUPER VOOC TM ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అందువల్ల క్షణాల్లో బ్యాటరీను వేగంగా రీచార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా, ఇది 15W VOOC, 33వాట్స్  PPS, 13.5వాట్స్ పవర్ డెలివరీ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, కాబట్టి  ఎలాంటి ఛార్జింగ్ పద్ధతులలోనైనా  సౌకర్యవంతంగా ఫోన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు.
 

Oppo A5x 5G : ఇతర కనెక్టివిటీ మరియు ఫీచర్స్
ఒప్పో A5x ఫోన్ 5G నెట్‌వర్క్, Wi-Fi 5 (802.11ac) ,Bluetooth 5.4, USB టైపు C పోర్ట్ మరియు3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెయిట్ సుమారు 194 గ్రాములు, మరియు మిడ్ నైట్ బ్లూ (Midnight Blue )మరియు లేసర్ వైట్ (Laser White) కలర్స్ లో  అందుబాటులో వున్నాయి.

FAQ

Q1. Oppo A5x 5G ధర & ఆఫర్స్ ఎలాంటి ఉన్నాయి?
A1.Oppo A5x 5G 4GB RAM + 128GB స్టోరేజ్ Laser White వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹11,399కి అందుబాటులో ఉంది. SBI/Axis క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్లతో ₹515 అదనపు తగ్గింపు కూడా ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ₹13,999కే లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో ₹7,490కి కొనుగోలు చేయవచ్చు.
 

Q2. Oppo A5x 5G లో డిస్‌ప్లే వివరాలు ఏమిటి?
A2. ఫోన్‌లో 6.67” HD+ (1604 x 720) LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 nits హై బ్రైట్ మోడ్ (HBM) ని సపోర్ట్ చేస్తుంది.

Q3. Oppo A5x 5G బ్యాటరీ & ఛార్జింగ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
A3. ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్, 15W VOOC, 33W PPS, 13.5W పవర్ డెలివరీ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఫోన్ వేగంగా రీచార్జ్ అవుతుంది.

Q4. Oppo A5x 5G కెమెరా ఫీచర్స్ ఏమిటి?
A3. రియర్ కెమెరా : 32MP వైడ్ ఏంగిల్ కెమెరా ; ఫ్రంట్ : 5MP సెల్ఫీ కెమెరా.
 

Q5. Oppo A5x 5G durability & certifications ఎలా ఉన్నాయి?
A5. Oppo A5x 5G కి IP65 రేటింగ్ ఉంది (నీరు & ధూళి నుండి రక్షణ). అలాగే MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది, షాక్, డ్రాప్, ఎక్సట్రీమ్ పరిస్థితుల్లో ఫోన్ సురక్షితం గా  ఉంటుంది .

 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment