రియల్మీ15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ( Game of Thrones Limited Edition )బుధవారం భారతదేశం మరియు గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది.ఈ మొబైల్ జూలైలో లాంచ్ చేసిన Realme 15 Pro 5G మోడల్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ . కొత్త రియల్మీ హ్యాండ్‌సెట్‌లో స్టాండర్డ్ మోడల్ లో ఉన్న ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు అలాగే ఉంచి , మొబైల్ డిజైన్ లో మాత్రం HBO యొక్క Game of Thrones సిరీస్ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన మార్పులు ఉన్నాయి. ఈ ఫోన్లో వెనుక స్టైలిష్ నానో ఎన్గ్రేవ్డ్ మోటిఫ్స్ అంటే ఒక క్రాఫ్ట్ డిజైనింగ్ ని తలపించేలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ముద్రలు చెక్క బడ్డాయి. మరియు ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ఫేస్ (UI) థీమ్‌లు ఉన్నాయి, ఇవి మొబైల్ కి మరింత ప్రీమియమ్ లుక్‌ను ఇచ్చాయి.
Realme 15 Pro 5G Game of Thrones Limited Edition : ధర మరియు అందుబాటు వివరాలు
ఇండియా లో రియల్మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర ₹44,999 గా నిర్ణయించబడింది. అయితే ఈ మొబైల్ ఒక్క 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. అయితే అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ లతో పేమెంట్ చేస్తే ₹3,000 వారికి డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్ Flipkart లోను మరియు దేశవ్యాప్తంగా ఉన్న రియల్మీ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లకు ఈ స్పెషల్ మొబైల్ ఎడిషన్ ను ఒక ప్రత్యేకమైన కలెక్టబుల్ ప్యాకేజింగ్ లో ఇస్తున్నారు ,మొబైల్ తో పాటు ఐరన్ థ్రోన్ ( Iron Throne) ఫోన్ స్టాండ్, కింగ్స్ హ్యాండ్ (King’s Hand )పిన్, వెస్ట్రోస్ (Westeros ) ప్రపంచం చిన్న సైజు మినీ మోడల్ , అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్రాండెడ్ స్టికర్లు, పోస్టుకార్డులు మరియు యాక్సెసరీలు ఈ ప్యాకేజింగ్ లో ఉంటాయి . ఈ Realme 15 Pro 5G Game of Thrones Limited Edition సిరీస్ ప్రేమికులకు చాల బాగా నచ్చుతుంది.

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition : థీమ్ డిజైన్
రియల్మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకమైన బ్లాక్ మరియు గోల్డ్ స్టైలింగ్ తో వస్తుంది. ఫోన్లోని కెమెరా ఐలాండ్ చుట్టూ త్రీడి లో డ్రాగన్ కాళ్ళు ఆకారం లో బోర్డర్ మరియు సున్నితమైన నానో ఎన్గ్రేవ్డ్ మోటిఫ్స్ అంటే గేమ్ ఆఫ్ థ్రోన్ థీమ్ బ్యాక్‌గ్రౌండ్ చిన్న చిన్న ప్యాటర్న్ లు ఉంటాయి. ప్రతి లెన్స్ చుట్టూ ఆకర్షణీయమైన డెకరేటివ్ రింగులు ఉండగా, ఫోన్ దిగువ భాగంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లోని హౌస్ టార్గేరియన్ యొక్క చిహ్నమైన మూడు తలల డ్రాగన్ త్రీడి సింబల్ ఉంటుంది .
రియల్మీ కంపెనీ మొబైల్ కోసం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్‌లో కలర్ చేంజింగ్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. సాధారణంగా నల్లరంగులో ఉంటుంది, కానీ 42 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అగ్నిరంగు ( ఫైరీ రెడ్ )గా మారుతుంది. ఈ ఫీచర్ ఫోన్‌కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్‌కు తగిన విధంగా ప్రత్యేకమైన మరియు డైనమిక్ లుక్‌ను ఇస్తుంది.
రియల్మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌లో రెండు ప్రత్యేక థీమ్ కలర్స్ లో మొబైల్ ఫోన్స్ డిజైన్ చేసారు . ఒకటి ఐస్ థీమ్ ఇంకోటి డ్రాగన్ ఫైర్ థీమ్ . అంతేకాకుండా ఈ ఎడిషన్‌లో ప్రత్యేకమైన Game of Thrones వాల్పేపర్లు మరియు ఐకాన్లు కూడా ఇస్తారు , వీటితో ఫోన్‌ను పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు.







