Samsung Galaxy M17 5G మొబైల్ ఇండియా లో లాంచ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ కోసం చూడండి.

By Damodar Mandala

Published On:

Samsung galaxy m17 5g price in india 8gb

Join WhatsApp

Join Now

సామ్‌సంగ్ ఇండియాలో Samsung Galaxy M17 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే ” జెన్ – జెడ్ ” గా పిలువబడే యంగ్ స్టర్స్ ను లక్ష్యంగా పెట్టుకుని, ₹15,000 కంటే తక్కువ ధర తో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ‘No Shake Camera’ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ ఫీచర్‌ తో అందుబాటులోకి వస్తుంది . ఈ ఆఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, Exynos చిప్‌సెట్‌తో లాంచ్ అవుతుంది , అలాగే మొబైల్ స్లిమ్ డిజైన్ తో డ్యూరబుల్‌గా ఉంది. రేపు అక్టోబర్ 13 నుండి సేల్‌కు సిద్ధం అవుతుంది .

ఇండియా లో సామ్‌సంగ్ M సిరీస్ ను విస్తరిస్తూ పోతుంది . అసలైన ఇన్నోవేషన్ అంటే వినియోగదారులు నిజంగా మార్పు తీసుకురావడానికి సాంకేతికతను పరిచయం చేయడం. Galaxy M17 5G ద్వారా, మేము M సిరీస్ ‘ Monster Innovations ‘ కొనసాగిస్తూ ₹10,000 – ₹15,000 మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన ‘No Shake Camera’ ను పరిచయం చేస్తున్నాం. ఈ మొబైల్ నెక్స్ట్ లెవల్ డ్యూరబిలిటీ, AI సామర్థ్యాలు మరియు స్లిమ్ డిజైన్ కూడా కలిగి ఉంది, ఇవి నిరంతర అడ్వెంచర్స్‌ను క్యాప్చర్ చేయాలనుకునే Gen-Z యంగ్ స్టర్స్ ఆశలను తీర్చడానికి అని సామ్‌సంగ్ ఇండియా, మొబైల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ డైరెక్టర్ అక్షయ్ ఎస్. రావ్ అన్నారు.

Samsung Galaxy M17 5G price in India
image Credits : samsung

Samsung Galaxy M17 5G : ధర మరియు అందుబాటు

గేలక్సీ M17 మొబైల్ 4GB రేమ్ /128GB స్టోరేజ్ వెరియంట్ కేవలం ₹12,499 నుంచి అందుబాటులో ఉంటుంది. 6GB రేమ్/128GB స్టోరేజ్ మరియు 8GB రేమ్/128GB స్టోరేజ్ వెరియంట్లు వరుసగా ₹13,499 మరియు ₹14,999 ధర లో లభిస్తాయి. అదనంగా వినియోగదారులు అన్నిబ్యాంకు కార్డులు మరియు ప్రైవేట్ EMI కార్డ్స్ ద్వారా 3 నెలల No Cost EMI పొందవచ్చు. ఇది Amazon, Samsung.com మరియు రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

also Read : రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలయింది..మొబైల్ చూసావా ?

Samsung Galaxy M17 5G : స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M17 5G మొబైల్ 6.77అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ ప్లే కలిగి ఉంటుంది , రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్ తో 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 1100 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది . డిస్ ప్లే కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ (Corning Gorilla Glass Victus ) ప్రొటాక్షన్ కూడా వుంది .

ఈ డివైస్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ (Octa-Core Exynos) 1330 చిప్‌సెట్‌తో 5nm ప్రాసెస్ తో బెటర్ పవర్ ఎఫిసియన్సీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా Mali-G68 MP2 GPUతో సమర్ధవంతమైన గ్రాఫిక్స్ సపోర్ట్ ఇవ్వబడింది. ఈ మొబైల్ మూడు RAM వెరియంట్లలో లభిస్తుంది. 4GB, 6GB మరియు 8GB, మరియు 128GB సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌ తో వస్తుంది. స్టోరేజీని 2TB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు .

ఆండ్రాయిడ్ (Android) 15 ఆధారంగా పనిచేసే గేలక్సీ M17 మొబైల్ Samsung One UI 7 ఇంటర్‌ఫేస్ మరియు ప్రత్యేక ఫీచర్లను కస్టమైజ్ చేస్తుంది. అంతేకాకుండా సామ్‌సంగ్ ఆరు సంవత్సరాల OS అప్‌డేట్లు మరియు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తుందని హామీ ఇచ్చింది, అంటే ఫోన్ కనీసం ఆండ్రాయిడ్( Android) 21 వరకు అప్‌డేట్ అవుతుంది.

Samsung Galaxy M17 5G మొబైల్ వెనుక వైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్‌ట్రా వైడ్ లెన్స్ మరియు 2 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా ఇవ్వబడ్డాయి . ఫ్రంట్ వైపు 13 మెగా పిక్సెల్ కెమెరా సపోర్ట్ తో అందమైన సెల్ఫీస్ మరియు వీడియో కాల్స్‌ను తీసుకోవచ్చు.

డివైస్‌ను పవర్ తో నింపడానికి 5000 mAh భారీ బ్యాటరీ ఇచ్చారు. దీని తో 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ USB టైపు-సి చార్జర్ ఇవ్వబడినది. సామ్‌సంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం 18 గంటల వరకు వీడియోస్ ని ఈ బ్యాటరీ తో చూడొచ్చు . అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ అని చూపిస్తూ IP54 రేటింగ్ ఇవ్వబడింది.

FAQ

Q1. Samsung Galaxy M17 5G లాంచ్ ధర ఏమిటి?
A1. Galaxy M17 5G మొబైల్ 4GB RAM / 128GB స్టోరేజ్ ₹12,499 నుండి, 6GB RAM / 128GB ధర ₹13,499 మరియు 8GB RAM / 128GB ధర ₹14,999 దగ్గర లభిస్తుంది.

Q2. గేలక్సీ M17 మొబైల్ కెమెరా స్పెసిఫికేషన్స్ ఏమిటి?
A2. మొబైల్ వెనుక 50 MP మెయిన్ కెమెరా , 50 MP అల్‌ట్రా వైడ్ లెన్స్ మరియు 2 MP మైక్రో కెమెరా వున్నాయి . ఫ్రంట్ వైపు 13 MP కెమెరా ఉంది. “No Shake Camera” ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో వీడియో మరియు ఫోటోలు క్లారిటీగా తీయవచ్చు.

Q3. Samsung Galaxy M17 5G బ్యాటరీ మరియు ఛార్జింగ్ ఫీచర్స్ ఏంటి?
A3. మొబైల్ లో 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్, USBటైపు C చార్జర్ ఇవ్వబడ్డాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 18 గంటల వీడియో ప్లే సాధ్యం.

Q4. గేలక్సీ M17 మొబైల్ ఏ Android వెర్షన్‌తో వస్తుంది మరియు ఎలాంటి updates ఇస్తుంది?
A4. Android 15 ఆధారంగా Samsung One UI 7 ఇన్‌స్టాల్‌తో వస్తుంది. 6 సంవత్సరాల OS & సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి.

Q5. గేలక్సీ M17 మొబైల్ డిజైన్ మరియు డ్యూరబిలిటీ  గురించి చెప్పండి?
A5. మొబైల్ 6.77 క్వాడ్ కర్వ్ AMOLED డిస్‌ప్లే, Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ తో స్లిమ్ & డ్యూరబుల్ బాడీ. IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment