Oppo Find X9 Pro ని చైనా లో లాంచ్ చేసింది.7,500 mAh బ్యాటరీ, అత్యుత్తమ స్పెసిఫికేషన్స్ తో ఇండియా లో లాంచ్ ఎప్పుడంటే ?

By Damodar Mandala

Published On:

oppo find x9 pro 5g price in india

Join WhatsApp

Join Now

ఒప్పో మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లైన Oppo Find X9 Pro మరియు Oppo Find X9లను గురువారం చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లలో శక్తివంతమైన MediaTek Dimensity 9500 SOC ప్రాసెసర్‌ను అమర్చారు.ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ( Android )16 ఆధారంగా రూపొందించిన కలర్ ఆపరేటింగ్ సిస్టమ్ (Color OS 16 ) సపోర్ట్‌తో వస్తున్నాయి. రెండు ఫోన్లలోనూ ప్రముఖ స్వీడన్‌ కెమెరా మ్యానిఫేక్చరర్ Hasselblad భాగస్వామ్యం తో రూపొందించిన కెమెరా సెటప్ ఉంది. Oppo Find X9 Pro మరియు X9 ఫోన్ల ఫీచర్లు, ధరలు, ముఖ్యమైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Oppo Find X9 Pro : గ్లోబల్ లాంచ్ వివరాలు

ఒప్పో తన న్యూ ఎంట్రీ స్మార్ట్‌ఫోన్‌లు Oppo Find X9 Pro, X9 లను 2025 గురువారం 16 నా చైనాలో అధికారికంగా విడుదల చేసారు. గ్లోబల్ లాంచ్ అక్టోబర్ 28 అని ఇండియా లో నవంబర్ 18 టైం లైన్ లో విడుదల అవ్వొచ్చు అని టెక్ వర్గాల అంచనా.

Oppo Find X9 Pro & X9 : ధరలు

గమనిక : CNY అంటే చైనీస్ యువాన్ అని అర్ధం

Oppo Find X9 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 12 GB RAM / 256 GB స్టోరేజ్ వెర్షన్‌ ధర CNY 4399 (ఇండియా కరెన్సీ లోసుమారు ₹54,300 )గా ఉంది. అలాగే 12 GB RAM / 512 GB స్టోరేజ్ వెర్షన్‌ ధర CNY 4999 (సుమారు ₹61,700) మరియు 16 GB RAM / 256 GB వెర్షన్‌ ధర CNY 4699 (సుమారు ₹58,000)గా నిర్ణయించారు ఈ మూడు వెర్షన్లు కూడా ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి .

అలాగే ఈ మొబైల్స్ హై స్టోరేజ్ కోరుకునే వినియోగదారుల కోసం Oppo Find X9 యొక్క 16 GB RAM / 512 GB స్టోరేజ్ వెర్షన్‌ ధర CNY 5299 ( ఇండియా కరెన్సీ లో సుమారు ₹65,400)గా ఉంది. అలాగే 16 GB RAM / 1 TB స్టోరేజ్ వెర్షన్‌ ధర CNY 5799 (సుమారు ₹71,600)గా నిర్ణయించారు.

Oppo Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌ బేస్ వెర్షన్ 12 GB RAM / 256 GB స్టోరేజ్ ధర CNY 5299 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹65,400)గా ఉంది. అలాగే 12 GB RAM / 512 GB స్టోరేజ్ ధర CNY 5699 (సుమారు ₹70,300), 16 GB RAM / 512 GB స్టోరేజ్ ధర CNY 5999 (సుమారు ₹74,100), మరియు 16 GB RAM / 1 TB స్టోరేజ్ ధర CNY 6699 (సుమారు ₹82,700) గా నిర్ణయించబడ్డాయి.

oppo find x9 pro 5g  launch in india
image Credits : Oppo

Oppo Find X9 Pro :స్పెసిఫికేషన్స్

ఒప్పో ఫైండ్ X9 ప్రో లో 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేసే 6.78 ఇంచి ల LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లే రిజల్యూషన్ 1.5K పిక్సెల్స్ మరియు పీక్ బ్రైట్‌నెస్ 3600 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్ రక్షణ కోసం కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ ఇవ్వబడింది.

X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ లో మీడియా టెక్ డిమెన్సిటీ (MediaTek Dimensity )9500 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇంకా రేమ్ 12GB/16GB వరకు మరియు స్టోరేజ్ 1TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ (Android )16 ఆధారంగా పని చేసే కలర్ ఆపరేటింగ్ సిస్టం (Color OS) 16 తో రన్ అవుతుంది.

Oppo Find X9 Pro ట్రిపుల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. మొబైల్ రియర్ కెమెరా 50 మెగాపిక్సల్స్ సోనీ LYT-828 సెన్సార్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ సపోర్ట్ తో ఉంది. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో 200 మెగాపిక్సల్స్ సామ్ సంగ్ HP5 సెన్సార్ పెరిస్కోప్ టెలిఫోటోలెన్స్ మరియు , ఆటోఫోకస్ ఫీచర్ కలిగిన సామ్ సంగ్ JN5 సెన్సార్ తో 50 మెగాపిక్సల్స్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి మరియు ముందు వైపు 50 మెగాపిక్సల్స్ కెమెరా ఇవ్వబడ్డాయి.

X9 ప్రోలో 7,500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ 80W వైర్డ్ సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ ను, 50W వైర్లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ ని సపోర్ట్ చేయగలదు.సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు .మొబైల్ దుమ్ము , వాటర్ రెసిస్టెంట్ అని నిర్ధారించడానికి IP66, IP68, IP69 రేటింగ్స్ కూడా కలిగి ఉంటుంది.

alsoRead : iQOO 15 స్మార్ట్ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు మరియు మరిన్ని వివరాలు!

Oppo Find X9 :స్పెసిఫికేషన్స్

Oppo Find X9 లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో 6.59 ఇంచి లా AMOLED డిస్‌ప్లే ఉంటుంది. మరియు స్క్రీన్ రక్షణ కోసం కోర్నింగ్ గోరిల్లా గ్లాస్ ఉపయోగించబడింది.

ఫైండ్ X9 కూడా మీడియా టెక్ డిమెన్సిటీ 9500 ఆక్టా కోర్ SOC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా 12GB /16GB RAM ఆప్షన్‌లో లభిస్తుంది మరియు స్టోరేజ్ 256GB, 512GB లేదా 1TB వరకు ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పని చేసే కలర్ ఆపరేటింగ్ సిస్టం 16 తో రన్ అవుతుంది.

కెమెరా విషయంలో మొబైల్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అయితే OIS సప్పోర్ట్ తో 50 మెగాపిక్సల్స్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50MP మెగాపిక్సల్స్ అల్ట్రా వైడ్ కెమెరా . 3x ఆప్టికల్ జూమ్ మరియు 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేసే పెరిస్కోప్ టెలిఫోటో 50 మెగాపిక్సల్స్ సోనీ LYT-600 సెన్సార్ ఉంటాయి . ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సల్స్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Oppo Find X9 లో 7025 mAh బ్యాటరీ 80W సూపర్ వూక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50W వైర్లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఒప్పోఫైండ్ X9 ప్రో లాగే X9 కూడా డ్యూరబిలిటీ కోసం IP66, IP68, మరియు IP69 రేటింగ్స్ ఇవ్వబడ్డాయి , సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది .

 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment