Vivo Y31 5G స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్స్ తో 6,500mAh బ్యాటరీ 50మెగాపిక్సెల్ కెమెరా తో రూ .13,500 కి అమెజాన్ లో అందుబాటు లో ఉంది.

By Damodar Mandala

Published On:

Vivo Y31 5G 6500mah battery 50mp camera available on amazon

Join WhatsApp

Join Now

వివో సంస్థ తమ Y సిరీస్‌ లేటెస్ట్ మోడల్‌లను సెప్టెంబర్ లో విడుదల చేసింది. ఈ కొత్త లైన్‌అప్‌ లో ఉన్న Vivo Y31 5G 6,500mAh బ్యాటరీ 50మెగాపిక్సెల్ రియర్ కెమెరా తో పాటు IP68 మరియు IP69 రేటింగ్స్ తో ప్రస్తుతం అమెజాన్లో తక్కువ ధర కి అవైలబుల్ గా ఉంది .ఒకసారి పూర్తి వివరాలు చూసి కొనుగోలు చేయండి.

Vivo Y31 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర

ఇండియా మార్కెట్ లో వివో Y31 5G యొక్క 4GB RAM /128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర ₹14,999 , అలాగే, 6GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర ₹16,499 గా ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌ రోజ్ రెడ్ ( Rose Red) మరియు డైమండ్ గ్రీన్ ( Diamond Green ) అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.

అయితే Vivo Y31 5G ఫోన్ల మీద అమెజాన్ , క్రోమా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.Amazon‌లో ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ₹1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్ ఉపయోగించే కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. Croma ప్లాటుఫారంలో IDFC మరియు Yes Bank క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ EMI సదుపాయం ఇస్తున్నారు. అంతేకాదు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
 

Vivo Y31 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్

వివో Y31 5G ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.68 ఇంచిలా హై డెఫినిషన్ ప్లస్ LCD డిస్‌ప్లే అమర్చబడింది. 1,608 x720 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన ఈ స్క్రీన్ 264ppi పిక్సెల్ డెన్సిటీ, 83% NTSC కలర్ గామట్, మరియు గరిష్ట 1,000 నిట్స్ హై బ్రైట్‌నెస్‌ను కలిగివుంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ 4nm ప్రాసెస్‌పై నిర్మించబడిన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 2 ( Snapdragon 4 Gen 2) ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో రెండు పర్ఫార్మెన్స్ కోర్‌లు మరియు ఆరు ఎఫిషియెన్సీ కోర్‌లు ఉన్నాయి. ఇవి ఫోన్ పనితీరును మెరుగుపరుస్తాయి.
 
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15( Android 15) ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం 15 (FuntouchOS 15) ఇంటర్ పేస్ పై రన్ అవుతుంది. Vivo Y31 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌ లో 4GB/ 6GB RAM (LPDDR4X ) మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది.అంతే కాదు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చును.
 
Vivo Y31 5G is available in Rose Red and Diamond Green
image credits : vivo

Vivo Y31 5G స్మార్ట్ ఫోన్ కెమెరా & బ్యాటరీ

వివో Y31 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.ఇందులో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 0.08 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఇవ్వబడ్డాయి. అండర్‌వాటర్ ఫోటోగ్రఫీకి కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. మొబైల్ ముందు భాగంలో 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాఉంటుంది.
 
ఈ స్మార్ట్ ఫోన్ కి 6,500mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా తక్కువ టైం లో 50 % ఛార్జింగ్ ని కంప్లీట్ చేయవచ్చును. ఈ మొబైల్ కు దుమ్ము ,ధూళి బయట నుంచి వచ్చే వాటర్ నుంచి మొబైల్ ని ప్రొటాక్టు కోసం చేసిన టెస్ట్ లో IP68 మరియు IP69 రేటింగ్స్ ఇవ్వబడింది.
 
కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూ టూత్ 4.1, USB 2.0 Type C పోర్ట్, ఆక్సిలెరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సార్( ambient light sensor) ,ప్రాక్సిమిటీ సెన్సార్ ( proximity sensor) మరియు ఈ కాంపస్ (e-compass) వంటి సెన్సర్‌లు కూడా ఉన్నాయి.
 
FAQ
 
Q1. Vivo Y31 5G నిజంగా వాటర్‌ప్రూఫ్‌ ఫోనా?
A1. ఈ స్మార్ట్‌ఫోన్‌కి IP68 మరియు IP69 రేటింగ్‌లు ఉన్నాయి. అంటే ఇది నీటి చినుకులు, ధూళి, అలాగే తాత్కాలికంగా నీటిలో పడితే రక్షణ ఇస్తుంది. అయితే ఎక్కువసేపు నీటిలో ఉంచడం సిఫార్సు చేయబడదు.
 
Q2. Vivo Y31 5G బ్యాటరీ ఎంతసేపు నిలుస్తుంది?
A2. ఈ ఫోన్‌లో ఉన్న 6,500mAh భారీ బ్యాటరీ సగటుగా ఒక రోజు కంటే ఎక్కువ బ్యాకప్ ఇస్తుంది. అలాగే 44W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు.
 
Q3. Vivo Y31 5G కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది?
A3. ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా మరియు 0.08MP మైక్రో కెమెరా ఉన్నాయి. క్లారిటీ గల ఫోటోలు, డీటైల్డ్ షాట్స్ అందిస్తాయి.ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.అండర్‌వాటర్ ఫోటోగ్రఫీ కూడా సపోర్ట్ చేస్తుంది.
 
Q4. Vivo Y31 5G ప్రాసెసర్ పనితీరు ఎలా ఉంటుంది?
A4. ఈ ఫోన్‌లో ఉన్న Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ చాలా ఎఫిషియెంట్‌గా, వేగవంతంగా పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌, రోజువారీ యూజ్ కోసం బాగానే ఆప్టిమైజ్‌ చేయబడింది.
 
Q5. Vivo Y31 5Gలో ఏ డిస్‌ప్లే వాడారు?

A5. ఇందులో 6.68 inch HD+ LCD డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz refresh rate మరియు 1000 nits brightness కలిగిన హై క్వాలిటీ స్క్రీన్‌.
 
Q6. Vivo Y31 5G ధర ఎంత ఉంది?

A6. Vivo Y31 5G యొక్క 4GB / 128GB వేరియంట్‌ ₹14,999, 6GB / 128GB వేరియంట్‌ ₹16,499 ధరతో Amazonలో లభిస్తోంది. కానీ Amazon‌లో ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ₹1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మొబైల్ ఎక్స్చేంజి ఆఫర్ కూడా ఉంది.
 
 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment