Realme C85 5G మరియు Realme C85 Pro 4G మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్స్ 7,000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తో త్వరలో ఇండియా కి రాబోతున్నాయి.

By Damodar Mandala

Published On:

Realme C85 5G & Pro 4G Debut with 7000mAh Battery

Join WhatsApp

Join Now

రియల్‌మీ వియత్నాం మార్కెట్‌కి ఈ నవంబర్ నెల 3 వ తేదీన Realme C85 5G మరియు Realme C85 Pro 4G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. Realme C85 5G వేరియంట్‌ మీడియా టెక్ డిమెన్షిటీ 6300 (MediaTek Dimensity 6300 )చిప్‌సెట్‌ తో హై రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ చేసే LCD స్క్రీన్‌ మరియు 5G కనెక్టివిటీ తో విడుదల అవుతుంటే, మరోవైపు, C85 Pro 4G మోడల్‌ AMOLED డిస్‌ప్లే తో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 685 (Snapdragon 685) ప్రాసెసర్‌ తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ (Android 15 ) ఆధారంగా పనిచేసే రియల్‌మీ యూజర్ ఇంటర్ఫేస్ 6 (Realme UI 6) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. మరిన్ని వివరాలు ఈ పోస్ట్ లో తెలుసుకోడానికి పూర్తిగా చదవండి. అలాగే మీ విలువైన కామెంట్ ఇవ్వండి.

Realme C85 5G, Realme C85 Pro 4G ధరలు & రంగులు

Realme C85 5G 8GB / 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర వియత్నాంలో VND 7,690,000 (ఇండియా కరెన్సీ లో దాదాపు ₹26,100 )గా నిర్ణయించబడింది. అలాగే Realme C85 Pro 4G స్మార్ట్ ఫోన్ 8GB /128GB వేరియంట్‌ ధర VND 6,490,000 ( ఇండియా కరెన్సీ లో దాదాపు ₹22,100 )నుండి ప్రారంభమవుతుంది. 8GB /256GB స్టోరేజ్‌ధర VND 7,090,000 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹24,100)గా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ పార్రోట్ పర్పుల్ (Parrot Purple) మరియు పీకాక్ గ్రీన్ (Peacock Green ) కలర్స్ లో మార్కెట్ లోకి రియల్‌మీ విడుదల చేస్తుంది.

Realme C85 5G స్పెసిఫికేషన్లు :

Realme C85 5G స్మార్ట్ ఫోన్‌లో144Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ చేసే 6.8 ఇంచీలా హై డెఫినిషన్ ప్లస్ 1570×720 రిజల్యూషన్‌ ఉన్న LCD డిస్ ప్లే అమర్చబడింది. 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్‌కి శక్తినిచ్చేది మీడియా టెక్ డిమెన్షిటీ 6300 (MediaTek Dimensity 6300) చిప్‌సెట్. 8GB RAM / 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి ఉంటుంది.అయితే 24GB వరకు వర్చువల్‌ RAM ని పెంచుకోవచ్చు. మొబైల్ ఆండ్రాయిడ్ 15 ( Android 15 ) ఆధారంగా పనిచేసే రియల్‌మీ యూజర్ ఇంటర్ఫేస్ 6 (Realme UI 6) పైన రన్ అవుతుంది.

realme c85 5g price in india
image credits : realme

రియల్‌మీ C85 5G ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ Sony IMX852 ప్రైమరీ రియర్‌ సెన్సార్‌ మరియు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా మొబైల్ ముందు వైపు ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ లో 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇవ్వబడింది. రెండు రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. అలాగే డ్యూయల్‌ స్పీకర్లు, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్, మైక్రో SD కార్డ్‌ సపోర్ట్, మరియు హెవీ టాస్క్ లు చేస్తున్నప్పుడు వచ్చే మొబైల్ హీట్ ని రెడ్యూస్ చేయడానికి 6,050mm² వేపర్ ఛాంబర్ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది.USB Type C కనెక్టివిటీ కూడా ఇవ్వబడింది.రియల్‌మీ C85 5G స్మార్ట్ ఫోన్ కి IP69 ప్రో రేటింగ్‌ కలిగిన వాటర్‌ & డస్ట్‌ రెసిస్టెంట్‌ బాడీతో డిజైన్ చేయబడింది . మొబైల్ బరువు సుమారు 215 గ్రాములు ఉంటుంది.

also Read: Vivo Y31 5G స్మార్ట్ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్స్ తో 6,500mAh బ్యాటరీ 50మెగాపిక్సెల్ కెమెరా తో రూ .13,500 కి అమెజాన్ లో అందుబాటు లో ఉంది.

Realme C85 Pro 4G స్పెసిఫికేషన్లు:

రియల్‌మీ C85 ప్రో 4G స్మార్ట్ ఫోన్‌లో 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్‌ చేసే 6.8 ఇంచిలా ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ 1080×2344 రిజల్యూషన్‌ కలిగిన AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్రీన్ 4,000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌ మరియు హాయ్ బ్రైట్‌నెస్‌ మోడ్ లో 1,200 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ చూపించగలదు. ఈ మొబైల్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 685(Qualcomm Snapdragon 685) చిప్సెట్ 8GB RAM బేసిక్ గా ఉంటుంది. 24GB వరకు వర్చువల్‌ RAM పెంచుకోవచ్చును. అంతేకాదు 128GB స్టోరేజీ లేదా 256GB స్టోరేజీ ఆప్షన్ లో మొబైల్ మార్కెట్ లోకి విడుదల అవుతుంది. ఈ మొబైల్ కూడా ఆండ్రాయిడ్ 15 ( Android 15 ) ఆధారంగా పనిచేసే రియల్‌మీ యూజర్ ఇంటర్ఫేస్ 6 (Realme UI 6) పైన రన్ అవుతుంది.

రియల్‌మీ C85 ప్రో 4G ఫోన్‌లో కూడా 50 మెగాపిక్సెల్‌ Sony IMX852 ప్రైమరీ రియర్‌ సెన్సార్‌ మరియు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా మొబైల్ ముందు వైపు ఉంటాయి. 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇవ్వబడింది. మొబైల్ హీట్ ని రెడ్యూస్ చేయడానికి 6,050mm² వేపర్ ఛాంబర్ కూలింగ్‌ సిస్టమ్‌,సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్ తో పాటు మొబైల్ కి IP69 రేటింగ్ కలిగి ఉంది. మొబైల్ బరువు సుమారు 205 గ్రాములు.

చివరిగా ఈ రెండు మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఎలా అనిపించిందో comment ద్వారా మాకు తెలియచేయండి.

FAQ

Q1: Realme C85 5G మరియు C85 Pro 4G మధ్య ప్రధాన తేడా ఏమిటి?
A1: Realme C85 5G లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్‌ మరియు LCD డిస్‌ప్లే ఉంటుంది.
C85 Pro 4G లో Snapdragon 685 4G చిప్‌సెట్‌ మరియు AMOLED డిస్‌ప్లే ఉంటుంది.

Q2: ఈ రెండు ఫోన్లలో ఏ బ్యాటరీ కెపాసిటీ ఇవ్వబడింది?
A2: రెండింటిలోనూ 7,000mAh పెద్ద బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుంది.

Q3: Realme C85 సిరీస్ ఏ Android వెర్షన్ మీద పనిచేస్తుంది?
A3: సమాధానం: రెండూ Android 15 ఆధారంగా పనిచేసే Realme UI 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి.

Q4: కెమెరా పరంగా ఈ ఫోన్లలో ఏముంది?
A4:  రెండింటిలోనూ 50MP Sony IMX852 ప్రైమరీ కెమెరా మరియు 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడ్డాయి.

Q5: Realme C85 సిరీస్‌ ఏ రంగుల్లో లభిస్తుంది?
A5: సమాధానం: ఈ రెండు ఫోన్లు పార్రోట్ పర్పుల్ (Parrot Purple) మరియు పీకాక్ గ్రీన్ (Peacock Green) కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment