WhatsApp అంటూ ప్రతీఒక్కరిని పరిచయం చేస్తూ అందరిని ఒకే ప్లాటుఫార్మ్ మీద కలుపుతుంది WhatsApp అప్లికేషన్ . అందరం ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత చాట్స్, బిజినెస్ సమాచారం WhatsApp లో ప్రతిరోజూ షేర్ చేస్తూనే ఉన్నాం. అయితే WhatsApp తమ యూజర్ల డేటాను కాపాడేందుకు ఎన్నో శక్తివంతమైన భద్రతా ఫీచర్లు అందిస్తోంది. ఈరోజు WhatsApp లో ఉన్న ముఖ్యమైన Privacy, Security, మరియు Safety ఫీచర్లను సింపుల్ గా, క్లియర్ గా తెలుగు లో తెలుసుకుందాం.
WhatsApp Security Features : End-to-End Encryption బెస్ట్ ఫీచర్
వాట్సాప్ లో End-to-End Encryption ఎలా పనిచేస్తుందో తెలుసా ? వాట్సాప్ మీరు పంపిన సింపుల్ Plain Text అంటే సింపుల్ టెక్స్ట్ ని Cipher Text అంటే ఎవరు చదవలేని విధంగా ఒక కోడ్ లా మారుస్తుంది. మీ పంపిన మెసేజ్ నీ మీరు పంపిన రిసీవర్ దగ్గర మాత్రమే Decrypt అంటే మళ్ళీText గా చూపిస్తుంది . మధ్యలో WhatsApp servers కి కీ ఉండదు.వాట్సాప్ కూడా మీ మెసేజ్ చదవలేదు. Storage లో కూడా మెసేజ్ encrypted రూపంలోనే ఉంటుంది.కాబట్టి హ్యాకర్ WhatsApp serverను hack చేసినా, messages open చేయలేడు.
WhatsApp Security Features : Two-Step Verification
వాట్సాప్ లో ఈ ఫీచర్ ఇంకో సెక్యూరిటీ పిన్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. 6 digit PIN ఎనేబుల్ చేసుకోవటం వల్ల మీ WhatsApp ని కొత్త మొబైల్ లో లాగిన్ చేయాలని ప్రయత్నిస్తే ఈ పిన్ లేకపోతే చేయలేరు.
వాట్సాప్ లో Two-Step Verificationఎలా చేసుకోవాలి ?
- Step 1: WhatsApp తెరిచిSettings (పైన కుడి వైపు మూడు డాట్స్ → Settings) ఓపెన్ చేయండి.
- Step 2: Account అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
- Step 3: అక్కడ Two-step verification అనే ఆప్షన్ కనిపిస్తుంది → దానిపై టాప్ చేయండి.
- Step 4: ఇప్పుడు Enable బటన్‌ను క్లిక్ చేయండి.
- Step 5: మీరు గుర్తు పెట్టుకోగలిగే ఒక 6-digit PIN టైప్ చేయండి.
- Step 6:అదే PINను మళ్లీ టైప్ చేసి Confirm చేయండి.
- Step 7: ఇప్పుడు WhatsApp మీకు Email address అడిగుతుంది. Email ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు PIN మర్చిపోతే, Email ద్వారా రీసెట్ చేసుకోవచ్చు.మీ Email టైప్ చేయండి. Confirm చేయండి.
- Step 8: Done! Two-Step Verification మీ WhatsApp లో ఆన్ అయ్యింది.

WhatsApp Security Features: Chat Lock
చాట్ లాక్ అనేది మీరు ప్రైవసీ గా ఉంచాలి అనుకునే చాట్ ని Fingerprint / Face Unlock / Password తో లాక్ చేసి, మీ ఫోన్లో ఇతరులకు కనిపించకుండా ప్రొటాక్టు చేసుకోడానికి WhatsApp Security Features లో చెప్పుకోదగ్గది.
- Step 1: WhatsApp ఓపెన్ చేయండి.
- Step 2: లాక్ చేయాలనుకున్న చాట్‌ను ఓపెన్ చేయండి. (వ్యక్తి చాట్ లేదా గ్రూప్ చాట్ రెండూ కూడా లాక్ చేయొచ్చు.)
- Step 3: పైన ఉన్న పేరు (contact name / group name) పై టాప్ చేయండి.
- Step 4: చాట్ ఇన్ఫో పేజీలో కిందకు స్క్రోల్ చేయండి.మీకు Chat Lock అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేయండి.
- Step 5: Lock this chat with fingerprint / Face ID / device unlock అనే ఆప్షన్ వస్తుంది.దాన్ని Enable చేయండి.
- Step 6: మీ ఫోన్ fingerprint / face unlock ద్వారా ఓనర్‌ను verify చేస్తుంది.వెంటనే Chat Lock ఆన్ అవుతుంది.
మీ మైన్ WhatsApp Home Screen లోChats తెరిచి స్క్రీన్‌ని కొంచెం కిందికి pull చేయండి.Locked Chats అనే ఒక special folder కనిపిస్తుంది. అక్కడ మీ PIN / Fingerprint / Face ID తో మాత్రమే ఓపెన్ అవుతుంది.
ఏదైనా fake ఆక్టివిటీ కనిపిస్తే WhatsApp వెంటనే block చేస్తుంది. అలాగే వాట్సాప్ ను కొత్త ఫోన్లో install చేసినప్పుడు, పాత డివైస్ లోకి కూడా ఒక notification పంపుతుంది. ది మీరు కాదా?” అని అడుగుతుంది. మీరు అనుమతించకపోతే, కొత్త డివైస్‌తో login అవ్వడం అసాధ్యం WhatsApp Security Features లో ఇది చెప్పుకోదగ్గది.








