ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 లో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్

By Damodar Mandala

Updated On:

flipkart Big Billion Days google pixel 9 review

Join WhatsApp

Join Now

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 : Google Pixel  ప్రత్యేకమైన డీల్స్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్2025 సెప్టెంబర్ 23 నుంచి మొదలు అవుతుంది కానీ  Flipkart Plus మరియు Black సభ్యులకు  సెప్టెంబర్ 22న  నైట్ నుంచి ముందుగా  సేల్ యాక్సిస్ లోకి వస్తాయి . అదే సంధర్భంగా  Google తన ఫ్లాగ్‌షిప్ Pixel 9 లైనప్‌ను ఇప్పటి వరకు ఎప్పుడూ లేని చాలా తక్కువ ప్రైస్‌లతో Flipkart రాబోయే Big Billion Days సేల్‌లో ఉంచుతుంది.
 
Google Pixel 9 (12GB + 256GB వేరియంట్) అసలు లాంచ్ ప్రైస్ ₹79,999, కానీ  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో  కేవలం ₹34,999కి ఆఫర్ ప్రైస్ కి వస్తుంది . అంటే లాంచ్ ధర కంటే సగం కంటే తక్కువ ధరకే మనం కొనుక్కోవచ్చు . అదనంగా Flipkart,  ICICI Bank కార్డు ఆఫర్ మీద ₹2,000  మరియు  మొబైల్ ఎక్స్ఛేంజ్ బోనస్ ₹1,000  కలిపి మొత్తం ₹3,000  డిస్కౌంట్ ఇస్తోంది. దీని వల్ల ఎఫెక్టివ్ ప్రైస్ మరింత తగ్గేచాన్సు వుంది .
 
అదేవిధంగా Pixel 9 తో పాటు, Pixel 9 Pro Fold  కూడా భారీ  ప్రైస్ కట్  ₹42,000  వరకు ఉంది . దీని వల్ల Pixel 9 Pro Fold  ఒరిజినల్ ధర ₹1,79,999 అయితే Flipkart‌ ఆఫర్ లో   ₹1,29,999 కి వస్తుంది . అదనంగా కస్టమర్లు బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను కూడా ఈ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్‌పై పొందవచ్చును.
 

google Pixel 9 స్పెసిఫికేయిన్స్ :

60నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.3 అంగుళాల డిస్‌ప్లే  Corning Gorilla Glass Victus 2  ప్రొటక్షన్  తో , Tensor G4 ప్రాసెసర్, Titan M2 సెక్యూరిటీ చిప్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెట్‌అప్ మరియు 4,700mAh బ్యాటరీతో వస్తోంది. ఈ మోడల్ పియోనీ, పోర్సిలేన్, ఆబ్సిడియన్  మరియు వింటర్‌గ్రీన్  కలర్ వేరియెంట్ లో అందుబాటులో ఉంది.

google Pixel 9 Pro Fold‌ mobile
image source : google store

google Pixel 9 Pro Fold‌ స్పెసిఫికేయిన్స్ :

డిస్‌ప్లే :  120Hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాల LTPO ‘Super Actua Flex’ ఇన్నర్ డిస్‌ప్లే  ఉంటుంది.  Super Actua Flex అనే  ఫ్లెక్సిబుల్  OLED ప్యానెల్ వల్ల  స్క్రీన్ స్మూత్ గా ఓపెన్ ,క్లోజ్  అవుతుంది ,మల్టీటాస్కింగ్ కి , ప్రొడక్టివిటీ apps కోసం ఈ పెద్ద డిస్‌ప్లే సరిపోతుంది అని చెప్పొచ్చు. 6.3-అంగుళాల అవుటర్ స్క్రీన్ క్విక్ మెసేజెస్ ,కాల్స్ కోసం ఉపయోగ పడుతుంది.
 
ప్రాసెసర్ :  Pixel 9 Pro Fold లో Google కొత్త Tensor G4 చిప్‌సెట్ ఉంది, ఇది AI మరియు మెషిన్ లెర్నింగ్  టాస్క్‌లలో చాలా వేగంగా పనిచేస్తుంది. , 16GB RAM తో పాటు  స్టోరేజ్ 128GB తో  మొదలై 1TB  వరకు లభిస్తాయి. అదనంగా, ఇది IPX8 వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్‌లో 5,060mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, Qi వైర్‌లెస్ చార్జింగ్ మరియు రివర్స్ చార్జింగ్ ఫీచర్లు కూడా Pixel 9 Pro Fold  మొబైల్ లో ఉన్నాయి.   మొబైల్  Android 14  వెర్సన్ పైన రన్ అవుతుంటుంది. కానీ Android 16 వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు , అందుకు గాను Google 7 సంవత్సరాల OS మరియు సెక్యూరిటీ అప్‌డేట్స్ ప్రామిస్ ఇస్తోంది.
 
Pixel  మొబైల్ లో AI ఫీచర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో Gemini, Circle to Search, Pixel Screenshots వంటి ఫీచర్లకు సపోర్ట్ ఉంటుంది. Circle to Search  ఫీచర్ కోసం చెప్పుకుంటే స్క్రీన్ పైన ఇమేజ్ ని Circle ఆకారంలో వేలితో రౌండ్ చేసి గూగుల్ లో ఇమేజ్ సెర్చ్ చేయవచ్చు ,  Pixel 9 Pro Fold కొనుగోలు చేసే వారికి ఒక సంవత్సరం పాటు ఉచితంగా Google One AI Premium లభిస్తుంది. ఇందులో అడ్వాన్సుడ్ Gemini ఒప్షన్స్ ని  , Gmail మరియు Docs‌ లో ఫ్రీ గా  ఉపయోగించుకోవచ్చు  , అలాగే 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఇస్తుంది .
 
కెమెరా : Pixel 9 Pro Fold లో Google తన కెమెరా మ్యాజిక్‌ని కొనసాగించింది.  ఈ ఫోన్‌లో మూడు ప్రధాన Rear కెమెరాలు ఉన్నాయి. వైడ్ కెమెరా 48 megapixel Quad PD సెన్సర్, f/1.7 అపెర్చర్, 82° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆప్టికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో పనిచేస్తుంది. అల్ట్రావైడ్ కెమెరా 10.5 megapixel Dual PD కెమెరా, ఆటో ఫోకస్, f/2.2 అపెర్చర్, 127° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, మెక్రో ఫోకస్ సపోర్ట్ తో ఇచ్చారు.
 
ఇక టెలిఫోటో కెమెరా 10.8 megapixel Dual PD కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, f/3.1 అపెర్చర్, సూపర్ రెస్ జూమ్ ద్వారా 20x జూమ్ చేయగలదు,  అంతే కాకుండా  ఫ్రంట్ కెమెరాలు  20-megapixel మైన్ ఫోల్డింగ్ స్క్రీన్ లో ఇన్నర్ కెమెరా , 10-megapixel Dual PD కెమెరా, f/2.2 అపెర్చర్, 87° ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో ఔటర్ కెమెరా కవర్ డిస్ప్లే పై ఉన్నాయి .
 
also Read:
 
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో  ఇప్పుడు Google డివైసెస్‌తో పాటు Apple, Samsung, Motorola వంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. ఇందులో iPhone 16 Pro Max, Galaxy S24 సిరీస్ వంటి లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అదనంగా, EMI ఆప్షన్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, UPI-based డిస్కౌంట్‌లు, Axis Bank మరియు ICICI Bank కార్డ్ యూజర్లకు ప్రత్యేక రివార్డ్‌లు కూడా ఇవ్వబడుతున్నాయి.
 

రాబోయే 2025 దివాళి పండుగ కోసం, Google Pixel ఫ్లాగ్‌షిప్ లైన్, ముఖ్యంగా Pixel 10 సిరీస్ పై డీల్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే, Pixel 9 సిరీస్ వంటి గత తరహా ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్‌లు వచ్చే అవకాశం వుంది . గత సంవత్సరాల ప్యాటర్న్‌ని బట్టి, Flipkart భారత్‌లో ఈ డీల్స్ కోసం ప్రధాన ఛానెల్ అవుతుంది.

Pixel 10 సిరీస్ కొత్త మోడల్స్ అయిన Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL పై మోడరేట్ లాంచ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్లు లభించే అవకాశం ఉంది,   ఉదాహరణకి, Google స్టోర్  ఇప్పటికే HDFC క్రెడిట్ కార్డ్‌తో Pixel 10 Pro పై ₹10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. అదనంగా Google AI Pro, Fitbit Premium, YouTube Premium వంటి సర్వీసుల బండిల్ ఆఫర్స్ కూడా ఉండవచ్చు .

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment