Monsoon Gadget Safety tip – మీ గ్యాడ్జెట్లను ఎప్పుడూ పొడిగా ఉంచండి
మీ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను వర్షం మరియు తేమ నుండి ప్రొటాక్టు చేసుకోడానికి బయటకు వెళ్లేటప్పుడు వాటిని వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా బ్యాక్‌ప్యాక్ లో ఉంచండి. ఇవి తక్కువ ఖర్చుతో మార్కెట్ లో దొరుకుతాయి. వాటర్ డైరెక్ట్ గా మీ గ్యాడ్జిట్ ని కట్టాక్ట్ అవ్వకుండా కాపాడుతాయి. ఇంట్లో ఉన్నప్పుడు గ్యాడ్జెట్లను తడి చేరే ప్రదేశాలు అంటే తెరిచి ఉన్న కిటికీల దగ్గర ఉంచకండి. ఎందుకంటే వర్షపు నీరు చిమ్మి స్క్రీన్ లేదా మొబైల్ లోపలికి పోయే ఛాన్స్ వుంది. అలాగే, కిచెన్ లేదా బాత్‌రూమ్‌లలోని తేమ నుండి కూడా గ్యాడ్జెట్లను దూరంగా ఉంచండి.
also read : ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపులు ఎలా చేయాలి?
Monsoon Gadget Safety tip – మీ ఫోన్ లేదా గ్యాడ్జెట్ తడిస్తే వెంటనే చేయాల్సినవి
మీ ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఒకవేళ తడిస్తే భయపడకండి. మొదట డివైస్‌ను వెంటనే ఆఫ్ చేయండి. ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యి డివైస్ అంతర్గత భాగాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. గ్యాడ్జిట్ ఇంకా పనిచేస్తుందేమో అని బటన్లు నొక్కడం లేదా ఆన్ చేయడం ప్రయత్నించకండి.
తడి గ్యాడ్జిట్ ని పొడిగా చేసేందుకు సరైన పద్ధతి
మీ గ్యాడ్జెట్ తడిగా ఉన్నప్పుడు దాన్ని సిలికా జెల్ ప్యాకెట్లతో కూడిన సీల్డ్ బ్యాగ్ లేదా కంటైనర్‌లో ఉంచండి. ఇవి తేమను పీల్చుకోడంలో మీకు సహాయపడతాయి. సిలికా జెల్ దొరకని సందర్బాల్లో ఎండిన బియ్యం (dry rice)ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అయితే ఇది అంతగా ప్రభావవంతంగా ఉండదు. గ్యాడ్జిట్ ని 24 నుంచి 48 గంటలపాటు సీల్డ్‌గా ఉంచండి.
తడి గ్యాడ్జిట్ లను ఛార్జ్ చేయవద్దు
తడిచిన ఫోన్, ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఛార్జ్ చేయకండి. తడి గ్యాడ్జిట్ ని ఛార్జ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి శాశ్వత నష్టం కలిగించవచ్చును. ఛార్జింగ్ పోర్ట్‌లో నీరు చేరిందని అనుకుంటే, పూర్తిగా పొడిగా అయ్యే వరకు వేచి ఉండి మాత్రమే ఛార్జ్ చేయండి.
క్లౌడ్ బ్యాకప్ & ఇన్స్యూరెన్స్ తీసుకోండి
వర్షాకాలం లో గ్యాడ్జిట్స్ తడవడం లేదా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీ ముఖ్యమైన డేటాని సురక్షితంగా ఉంచుకోవడం చాలా అవసరం. మీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి ఫైళ్లను క్లౌడ్ స్టోరేజ్ (Cloud Storage) లేదా ఎక్సటర్నల్ హార్డ్ డ్రైవ్ (External Hard Drive) లో బ్యాకప్ చేయండి. ఇలా చేస్తే, మీ గ్యాడ్జిట్ పూర్తిగా దెబ్బతిన్నా కూడా డేటా సురక్షితంగా ఉంటుంది.
A1. Monsoon Gadget Safety కోసం మొదట డివైస్‌ను వెంటనే ఆఫ్ చేయాలి. తర్వాత SIM కార్డ్, మెమరీ కార్డ్, కవర్ వంటి వాటిని తొలగించి, పొడి బట్టతో నెమ్మదిగా తుడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్ చేయకండి లేదా ఛార్జ్ పెట్టకండి.
A2. బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా బ్యాక్‌ప్యాక్‌లో ఉంచండి. ఇంట్లో కిటికీ దగ్గర లేదా తడి ప్రదేశాల్లో ఉంచకండి. కిచెన్, బాత్‌రూమ్ వంటి తేమ ఉన్న ప్రదేశాల నుండి దూరంగా ఉంచండి.
A3. లేదు. అధిక వేడి డివైస్ లోపల సర్క్యూట్స్‌కి హాని చేస్తుంది. బదులుగా సిలికా జెల్ బ్యాగ్‌లో ఉంచడం ఉత్తమం.
A3. Monsoon Gadget Safety కోసం సాధ్యమైనంత వరకు వద్దు. నీటి చుక్కలు పోర్ట్ లేదా స్పీకర్ లోపలికి వెళ్లి short circuit అవ్వవచ్చు. వాటర్ రెసిస్టెంట్ డివైస్‌లను అయినా తక్కువ సమయం వాడండి.
A5. కనీసం 48 గంటలు ఉంచడం మంచిది. ఎక్కువ టైం ఉంచితే తేమ పూర్తిగా పీల్చుకుంటుంది. ఆ తర్వాత మాత్రమే ఆన్ చేయండి.







