iQOO 15 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ ( Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ, 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్‌ప్లే, మరియు కొత్త డిజైన్ ఆప్షన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
iQOO 15: లాంచ్ టైమ్‌లైన్
iQOO తన న్యూ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్ iQOO 15 ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అధికారిక విడుదలకు ముందే వచ్చిన టీజర్ల ద్వారా ఈ డివైస్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పటికే బయటపడ్డాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ముందుగా ఈ నెలలో 20 న చైనాలో విడుదల అవుతుంది. అందుకు గాను ఐక్యూ ఇండియా సి .ఈ .ఓ నిపుణ్ మార్య ట్విట్టర్ పోస్ట్ ద్వారా అక్టోబర్ 16 నా ట్వీట్ చేసారు .
A new chapter in flagship performance, coming soon! #iQOO15 #BeTheGOAT pic.twitter.com/pst7W8Wahx
— Nipun Marya (@nipunmarya) October 16, 2025
ఆ తరువాత భారత్‌లో iQOO 15 స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం నవంబర్ 15 నుండి నవంబర్ 25 మధ్య లాంచ్ కానుందని టెక్ వర్గాల అంచన . కానీ కంపెనీ ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కొన్ని ప్రాధమిక ప్రకటనల ప్రకారం ఈ నెలలో చైనాలో లాంచ్ తర్వాత త్వరలోనే గ్లోబల్ రోలౌట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సమాచారం.
iQOO 15: స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్
iQOO 15 స్మార్ట్‌ఫోన్ లో 6.85 ఇంచిలా ( LTPO AMOLED) డిస్‌ప్లే ఉండనుంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ పీక్ బ్రైట్‌నెస్ 2,600 nits వరకు అందించగలదని అంచనా. అంతర్గతంగా ఈ డివైస్ క్వాల్‌కామ్( Qualcomm) కొత్త స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) చిప్‌సెట్ తో బిల్ట్ చేసారు.
అంతేకాదు స్మార్ట్‌ఫోన్ గేమింగ్ పెరఫార్మన్స్ ని పెంచడానికి ప్రత్యేకంగా iQOO స్వంతంగా తయారుచేసిన Q3 గేమింగ్ చిప్ సెట్ ను ఇన్సర్ట్ చేసింది .
iQOO ఫోన్లు ఒకప్పుడు ఫన్ టచ్ OS ని ఉపయోగించేవి . కానీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ లో ఆండ్రాయిడ్ ( Android )16 ఆధారం గా పనిచేసే ఆరిజిన్ (Origin) OS 6 ని ఉపయోగించబోతుంది. ఈ వెర్షన్ మొబైల్స్ కి ఇండియా ప్లస్ అవ్వొచ్చు.
also Read : Samsung Galaxy M17 5G మొబైల్ ఇండియా లో లాంచ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ కోసం చూడండి.
iQOO 15: 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఈ రాబోయే హ్యాండ్సెట్‌లో కొత్తగా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా జత చేసారు. దీనితో వేగంగా మరియు ఖచ్చితంగా ఆథెంటికేషన్ చేయడానికి సహాయపడుతుంది అని భావిస్తున్నారు . ఈ మొబైల్ కి IP68 మరియు IP69 సర్టిఫికేషన్లు కలిగి ఉంది. దుమ్ము మరియు నీటి ప్రభావం నుండి రక్షణ అందిస్తుంది అని చెప్తున్నారు . అంతే కాకుండా iQOO గత మోడల్స్ ల ఛార్జింగ్ ఫీచర్ కి అప్గ్రేడ్ గా వైర్‌లెస్ చార్జింగ్ ని ఈ మోడల్ లో ఉంచారట.
iQOO 15 ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండబోతుంది , ఇది f/1.9 అపర్చర్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS ) సపోర్ట్ కూడా ఉంటుంది . అలాగే 50MP అల్ట్రా వైడ్ లెన్స్ (f/2.0) మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మొబైల్ కి హైపు పెంచుతుంది. ఈ లెన్స్ సహాయం తో 3x ఆప్టికల్ జూమ్ మరియు 100x డిజిటల్ జూమ్ రేంజ్ ఫొటోస్ కాప్చర్ చేయవచ్చు . ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని లీక్‌ల ద్వారా తెలిసింది.
బ్యాటరీ విషయంలో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ తో తయారుచేయబడిన 7,000mAh బ్యాటరీ iQOO 15 ఫోన్‌లో అమర్చారట. ఫోన్ 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 120W వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు . 0% నుండి 100% వరకు సుమారు 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందట. అదిమాత్రమే కాదు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.
iQOO 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ని నాలుగు కలర్ వేరియేషన్స్ లో అందుబాటులో కి తేబోతున్నారు . లెజెండ్ ఎడిషన్, లింగ్యున్ ఎడిషన్, విన్దేర్నెస్ ఎడిషన్, రేసింగ్ ఎడిషన్. లెజెండ్ ఎడిషన్( Legend Edition) వైట్ కలర్‌లో ఉంటుంది . లింగ్యున్ ఎడిషన్ ( Lingyun Edition ) లో వైట్ బ్యాక్‌తో పాటు గ్రే కలర్ ప్యాటర్న్స్ తో ఇవి వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు క్రిమ్సన్ ఆరెంజ్ రంగులోకి మారి చూపరుల కళ్ళకి అట్ట్రాక్టీవ్ గా కనిపిస్తుందట. విన్దేర్నెస్ ఎడిషన్ (Wilderness Edition ) గ్రీన్ కలర్‌లో, అలాగే రేసింగ్ ఎడిషన్ (Racing Edition) బ్లాక్ కలర్‌లో డిజైన్ చేసారు.
ధర అధికారికంగా వెలువడనప్పటికీ లేటెస్ట్ లీక్స్ ప్రకారం iQOO 15 బేస్ మోడల్ ధర సుమారుగా ₹60,000గా ఉంటుంది అని అంచనా . 12GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹59,999, 16GB RAM / 512GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹65,999 మరియు 16GB RAM / 1TB స్టోరేజ్ వేరియంట్ ₹69,990 వరకు ఉండవచ్చని అంచనా.
FAQ
Q1. iQOO 15 ఇండియా లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
A1. నవంబర్ నెల లో ఇండియా లోలాంచ్ అవుతుందని అంచనా!
Q2. ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏమిటి?
A2 6.85-inch LTPO AMOLED, 144Hz స్క్రీన్
Snapdragon 8 Elite Gen 5 + Q3 గేమింగ్ చిప్
7000mAh బ్యాటరీ, 100W వైర్డ్ & 50W వైర్‌లెస్ ఛార్జింగ్
50MP + 50MP + 50MP కెమెరాలు, ఫ్రంట్ 32MP
Android 16 + OriginOS 6
Q3. ప్రత్యేక ఫీచర్స్ ఏవీ?
A3. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
50MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ & 100x డిజిటల్ జూమ్
Q4. iQOO 15 కొత్త OS ఏది?
A4. Android 16 ఆధారంగా OriginOS 6, ప్రస్తుతం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్స్ లో ఉపయోగిస్తున్నారు.







