Lava Agni 4 5G స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ , 50MP బ్యాక్ కెమెరా + 50MP సెల్ఫీ కెమెరా , MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో మిడ్ రేంజ్ ప్రైస్ తో లాంచ్ అయింది.

By Damodar Mandala

Published On:

Lava Agni 4 5G launched in India

Join WhatsApp

Join Now
ఇండియా లోని స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయినటువంటి Lava మొబైల్ కంపెనీ నవంబర్ 20 గురువారం 2025 తన కొత్త Lava Agni 4 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.ఇందులో 5000mAh బ్యాటరీ , 50MP బ్యాక్ కెమెరా + 50MP సెల్ఫీ కెమెరా , MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో పాటు కంపెనీ AI పై దృష్టిని మరింత పెంచుతూ Vayu AI వంటి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఫీచర్స్ ఆడ్ చేసింది.ఈ VayuAI ద్వారా మీరు ఎడిట్ చేయడం, క్రియేట్ చేయడం, సమ్మరైజ్ చేయడం, ట్రాన్స్‌లేట్ చేయడం మరియు రికార్డ్ చేయడం వంటి పనులు చేయవచ్చు. అంటే కాదు ఈ Lava Agni 4 5G ఫోన్ లో Circle to Search ఫీచర్‌ కూడా సపోర్ట్ ఉంది.

Lava Agni 4 5G డిస్ ప్లే & కెమెరా

లావా Agni 4 లో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.67అంగుళాల AMOLED డిస్‌ప్లే అమర్చ బడింది. ఈ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్ తో పాటు 2400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. స్క్రీన్‌ వెట్ టచ్ సపోర్ట్ ఉంది. మరియు అదనంగా ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ( Corning Gorilla Glass) ప్రొటెక్షన్ కలిగి వుంది.

Lava Agni 4 5G మొబైల్ లో రియర్ కెమెరా సెటప్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజెషన్ సపోర్ట్ తో 50 మెగా పిక్సెల్ కెమెరా మరియు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అమర్చబడ్డాయి. మొబైల్ ముందు భాగంలో 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ ఫ్రంట్ మరియు రియర్ కెమెరాలు రెండూ 4K(60FPS) వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తాయి.

also Read : WhatsApp Security Features : మీ WhatsApp చాట్ భద్రముగా ఉంచుకోండిలా ?

Lava Agni 4 5G ప్రాసెసర్ & ఆండ్రాయిడ్ అప్ డేట్స్

లావా Agni 4 స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ డిమెన్షిటీ ( MediaTek Dimensity) 8350 5G ప్రాసెసర్ అమర్చబడింది . 8GB( LPDDR5X) RAM మరియు 256GB స్టోరేజ్ ను ఇవ్వబడింది. అంతే కాదు ఈ స్మార్ట్ ఫోన్‌లో 16GB వరకు వర్చువల్ RAM పెంచుకోవచ్చు అని చెప్తున్నారు . Lava Agni 4 5G మొబైల్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ ( Android 15 ) తో రన్ అవుతుంది. అయితే లావా ఈ స్మార్ట్ ఫోన్ లో 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్లు మరియు 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు అందించనుంది.
 
Lava Agni 4 5G price in India
image credits : avamobiles.com

Lava Agni 4 5G లో AI అసిస్టెంట్ ఫీచర్స్

లావా Agni 4 లో Vayu AI అసిస్టెంట్ ఫీచర్ ప్రత్యేకంగా భారతీయ యూజర్స్ కోసం AI Math Teacher, AI English Teacher వంటి ఎడ్యుకేషన్స్ అసిస్టెంట్ టూల్. ఇంకా AI Text Assistant & AI Call Summary వంటి వాటితో టెక్స్ట్ రాయడం, కాల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. AI Photo Editor,AI Image Generator తో పాటు Circle to Search ద్వారా స్క్రీన్‌లో ఏదైనా వస్తువును సర్కిల్ చేస్తే వెంటనే సెర్చ్ చేసే ఫీచర్ కూడా వుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో కస్టమైజ్ చేయగల Action Key ఉంది. షార్ట్ ప్రెస్, డబుల్ ప్రెస్, లాంగ్ ప్రెస్ వంటి మూడు రకాల ఆప్షన్లతో 100 కంటే ఎక్కువ కాంబినేషన్లు సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కెమెరా, టార్చ్, వైబ్రేషన్ మోడ్, యాప్స్ ఇంకా మరెన్నో ఫంక్షన్లను వెంటనే ట్రిగ్గర్ చేయవచ్చు అని చెప్తున్నారు.

Lava Agni 4 5G బ్యాటరీ, ధర మరియు కలర్స్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. 66W పాస్ట్ ఛార్జర్ కూడా మొబైల్ బాక్స్ తో పాటు అందిస్తున్నారు. IP64 రేటింగ్ Lava Agni 4 5G కలిగివుంది. ఈ మొబైల్ నలుపు రంగు (Phantom Black) మరియు లైట్ సిల్వర్ (Lunar Mist) కలర్స్‌లో మార్కెట్ లో కి విడుదల అవుతుంది. దీని ధర ₹24,999 గా ఉంది . అమ్మకాలు నవంబర్ 25 నుంచి Amazon లో ప్రారంభమవుతాయి.

అయితే మొబైల్ ఎక్స్చేంజి ఆఫర్స్ , క్రెడిట్ కార్డు ఆఫర్స్ చూసి ఆఫీసియల్ సైట్ నుంచి కానీ , అమెజాన్ నుంచి కానీ కొనుగోలు చేయగలరు. ఈ బ్లాగ్ పోస్ట్ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపములో మాకు తెలియపరచండి. అలాగే ఈ పోస్ట్ మీ మిత్రులకి షేర్ చేయండి.

 
FAQ
Q1. Lava Agni 4 5G డిస్‌ప్లే ఎలా ఉంటుంది?
A1. లావా Agni 4 లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్ ,120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్ విజువల్స్ అందిస్తుంది.
 

Q2. Lava Agni 4 5G లో Vayu AI అంటే ఏమిటి?
A2. Vayu AI అనేది Lava ప్రత్యేక AI అసిస్టెంట్. ఇది Math Teacher, English Teacher, AI Text Assistant, AI Call Summary, Photo Editor, Image Generator వంటి ఫీచర్లతో ఫోన్‌ను స్మార్ట్‌గా ఉపయోగించడానికి సహాయం చేస్తుంది.

Q3. Lava Agni 4 5G కెమెరా ఎలా ఉంటుంది?
A3. దీనిలో 50MP OIS ప్రధాన కెమెరా + 8MP అల్ట్రావైడ్ కెమెరా, అలాగే 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రెండు కెమెరాలు 4K 60FPS రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

Q4.ఈ ఫోన్ లో ఏ ప్రాసెసర్ ఉంది?
A4. Lava Agni 4‌లో MediaTek Dimensity 8350 5G ప్రాసెసర్ ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ మరియు డైలీ యూజ్‌లో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

Q5. Lava Agni 4 5G కు ఆండ్రాయిడ్ అప్డేట్లు ఎంతకాలం వస్తాయి?
A5. ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లు మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి.

Q6.ఈ ఫోన్ బ్యాటరీ & ఛార్జింగ్ వివరాలు ఏమిటి?
A6. Lava Agni 4 5G లో 5000mAh బ్యాటరీ ఉంది. బాక్స్‌లో 66W ఫాస్ట్ ఛార్జర్ కూడా అందిస్తారు.

Q7. Lava Agni 4 ధర ఎంత? ఎక్కడ కొనగలం?
A7. ఈ ఫోన్ ధర ₹24,999. నవంబర్ 25 నుంచి Amazon లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
 
 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment