Moto G06 Power ఎంట్రీ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్ 7,000 mAh బ్యాటరీతో రూ.7499 ధర తో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.

By Damodar Mandala

Published On:

Moto G06 Power with 7000mAh battery now at ₹7499 on Flipkart

Join WhatsApp

Join Now

Moto G06 Power ఎంట్రీ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ నీ మోటరోలా కంపెనీ ఇండియా లో అక్టోబర్ 7 నా విడుదల చేసింది. అయితే 4G స్మార్ట్ ఫోన్ కి IP64 రేటింగ్ తో పాటు 7,000 mAh బ్యాటరీ సామర్థ్యం కూడా ఉంది. అయితే పూర్తి వివరాలు చదవండి.

Moto G06 Power ప్రస్తుత ధర

మోటో G06 పవర్ స్మార్ట్ ఫోన్ 4GB RAM / 64GB స్టోరేజీ ధర ఇప్పుడు రూ.7499 గా ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ మోటోరోలా వెబ్సైట్ తో పాటు , ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవల్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తున్న వారికోసం ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఆప్షన్ కానీ 4G నెట్ వర్క్ సపోర్ట్ ఈ విషయం గమనించండి.

Moto G06 Power స్పెసిఫికేషన్స్

ఈ ఫోన్‌లో 6.88 ఇంచిలా హై డెఫినిషన్ ప్లస్ LCD డిస్ ప్లే ఉంటుంది . స్క్రీన్ రిజల్యూషన్ 1640 x 720 పిక్సెల్స్ . ఈ LCD డిస్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తుంది. మరియు 600 హై నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. ఈ స్క్రీన్ కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ (Corning Gorilla Glass) 3 ప్రొటాక్షన్ ఇవ్వబడింది.

also Read : Nothing Phone 3a Lite సిగ్నేచర్‌ ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌, Glyph Light టెక్నాలజీ , 2160 Hz PWM డిమ్మింగ్‌ ఫీచర్‌, 5000 mAh బ్యాటరీతో గ్లోబల్ లాంచ్

 

Moto G06 Power smatphone specifications in telugu
image credits : motorola

మోటో G06 పవర్ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో G81 ఎక్సట్రీమ్ (MediaTek Helio G81 Extreme) ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఒక ఆక్టా కోర్ CPU తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం మాలిG52 ( Mali-G52 MC2 ) GPU ని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా చేసుకుని మోటరోలా ప్రత్యేకమైన My UX కస్టమ్ ఇంటర్‌ఫేస్ మీద రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో 4GB RAM (LPDDR4X )ఉంది. దీనిని RAM Boost టెక్నాలజీ ద్వారా ఇంకా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే 8GB RAM వరకు ఉన్న ఇతర వేరియంట్లు కూడా అందుబాటులో ఉండవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే, ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. అలాగే 256GB స్టోరేజ్ లో ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయి.

Moto G06 Power కెమెరా

మోటో G06 పవర్ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఇవ్వబడింది.అయితే Quad Pixel టెక్నాలజీతో మరింత స్పష్టమైన మరియు క్లియర్ ఫోటోలు తీయగలదు అని చెప్తున్నారు. మొబైల్ ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ వైడ్ ఆంగిల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఉపయోగపడుతుంది.

Moto G06 Power బ్యాటరీ & ఇతర ఫీచర్స్

ఈ ఫోన్‌లో 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ అమర్చబడింది .ఇది 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే చార్జర్ ని సెపరేట్ గా కొనుక్కో వలసిన పనిలేదు 20W టర్బో పవర్ ఛార్జర్ బాక్స్ తో పాటు అందించ బడుతుంది.

మొబైల్ 4G నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తుంది. దీని IP64 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ వలన దుమ్ము దూళి ఎక్స్టర్నల్ వాటర్ బయటనుంచి రాకుండా ప్రోటాక్టు చేస్తుంది .సెక్కురిటీ కోసం మోటో G06 పవర్ స్మార్ట్ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఫేస్ అన్‌లాక్, ThinkShield for Mobile, మరియు Moto Secure వంటి ఫీచర్లతో వస్తుంది.

రంగుల విషయానికి వస్తే. ఈ ఫోన్ పాన్ టోన్ లారెల్ ఓక్ (Pantone Laurel Oak) అంటే గ్రీన్ మరియు గోధుమ కలర్ మిక్సింగ్ కలర్ , పాన్ టోన్ టెండ్రిల్ (Pantone Tendril) అంటే ఆకుపచ్చ కలర్ , మరియు పాన్ టోన్ టేపెస్ట్రీ (Pantone Tapestry ) అంటే గులాబీ మరియు పర్పుల్ మిక్సింగ్ కలర్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అంటే కాదు మొబైల్ వెనుక భాగం వీగన్ లెదర్ ఫినిష్ తో రూపొందించబడింది, ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

FAQ

Q1. Moto G06 Power ప్రస్తుతం ధర ఎంత?
A1. ప్రస్తుతం 4GB RAM / 64GB స్టోరేజ్ వేరియంట్ ధర ₹7,499, ఇది ఫ్లిప్‌కార్ట్ మరియు మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

Q2. Moto G06 Power ఫోన్ 5Gనా?
A2. కాదు, ఇది 4G స్మార్ట్‌ఫోన్ మాత్రమే. కానీ ఇది మంచి పనితీరును, పెద్ద బ్యాటరీని, మరియు బేసిక్ యూజర్లకు సరైన విలువను అందిస్తుంది.

Q3. Moto G06 Power బ్యాటరీ సామర్థ్యం ఎంత?
A3. ఈ ఫోన్‌లో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మరియు బాక్స్‌లోనే 20W టర్బోపవర్ ఛార్జర్ వస్తుంది.

Q4. ఈ ఫోన్‌కి ఏ ప్రాసెసర్ ఉంది?
A4. ఇందులో MediaTek Helio G81 Extreme ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది, ఇది రోజువారీ యూజ్ మరియు గేమింగ్ కోసం సరైన పనితీరును ఇస్తుంది.

Q5. Moto G06 Power యొక్క ముఖ్య ఫీచర్లు ఏమిటి?
A5. 6.88 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, Android 15 My UX ఇంటర్‌ఫేస్, IP64 వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మరియు వీగన్ లెదర్ ఫినిష్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతలు.

Q6. Moto G06 Power స్క్రీన్ ప్రొటెక్షన్ ఉందా?
A6. అవును, ఈ ఫోన్‌కి Corning Gorilla Glass 3 రక్షణ ఉంది, ఇది స్క్రాచ్‌ల నుంచి స్క్రీన్‌ను కాపాడుతుంది.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment