నథింగ్ మొబైల్ కంపెనీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ Nothing 3a తర్వాత జనరేషన్ వేరియెంట్ Nothing Phone 3a Lite నీ అక్టోబర్ 29 న గ్లోబల్ లాంచ్ చెసింది. అయితే ఈ వేరియెంట్ నథింగ్ తన సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తో పాటు, ప్రత్యేక మైన కాల్స్ కి ,నోటిఫికేషన్స్ కి అనుగుణంగా స్పందించే Glyph Light టెక్నాలజీ మరియు ఎక్కువ టైం స్క్రీన్ చూసిన కళ్ళకి అలసట రాకుండా 2160 Hz PWM డిమ్మింగ్ ఫీచర్ నీ టెక్ వరల్డ్ కి పరిచయం చేస్తుంది. 5000 mAh బ్యాటరీ తో రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్ కూడా ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ సొంతం. మొబైల్ పూర్తి ఫీచర్స్ కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Nothing Phone 3a Lite సిగ్నేచర్ డిజైన్ & డిస్ ప్లే
ఫోన్ 3a లైట్ అనేది Nothing యొక్క సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కొత్త రీతిలో చూపిస్తుంది . సింపుల్ గా కాన్ఫిడెంట్ లుక్‌తో, గ్లాస్ బాడీతో రూపొందించబడిన ఈ ఫోన్ క్లాసిక్ ప్లే ఫుల్ డిజైన్ మరియు రోజువారీ ఉపయోగానికి సరిపోయే ప్రాక్టికల్ ఫీల్ కలిగిస్తుంది. crafted అనిపించే ఈ స్మార్ట్ ఫోన్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో మార్కెట్ లోకి విడుదల చేసారు. రిచ్ ఫినిష్, గ్రిప్, మరియు నాజూకైన విజువల్ టెక్స్చర్స్ తో ఇతర ఎంట్రీ లెవల్ ఫోన్ల కు పోటీ ఇస్తుంది. అంతే కాదు Nothing Phone 3a Lite డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ ఇచ్చారు.
ఫోన్ 3a లైట్ లో120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.77 ఇంచీలు ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే అమర్చబడింది. ఈ డిస్‌ప్లేలో 3000 nits పీక్ HDR బ్రైట్‌నెస్ మరియు 1300 nits అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ నీ చూపించగలదు. (1080 × 2392) FHD+ రిజల్యూషన్ కలిగిన ఈ డిస్‌ప్లే 1.07 బిలియన్ కలర్స్ కనిపించేలా 10 బిట్ కలర్ డెప్త్ కలిగివుంది. అంతే కాదు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ చూసినా కళ్ళుకి అలసట కలగకుండా 2160 Hz PWM డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంది.
Nothing Phone 3a Lite స్మార్ట్ ఫోన్ Glyph Light టెక్నాలజీ

Nothing Phone 3a Lite లో ప్రాసెసర్ & OS అప్డేట్స్
Nothing Phone 3a Lite ట్రిపుల్ కెమెరా సిస్టమ్ & బ్యాటరీ
ఫోన్ 3a లైట్ లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా TrueLens Engine 4.0 టెక్నాలజీ సపోర్ట్ తో AI ఎడిటింగ్ టూల్స్ కలిపి ఇచ్చారు.119.5° ఫీల్డ్ వ్యూ కవర్ చేయగలిగే 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మైక్రో కెమెరా మొబైల్ వెనుక రియర్ లో ఉంటాయి. మొబైల్ కి 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా1080p స్లో మోషన్ రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
అలాగే 5000 mAh పెద్ద సామర్థ్యమైన బ్యాటరీ ఈ మొబైల్ లో 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ కేవలం 20 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 5 W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ ద్వారా మీ ఇతర యాక్సెసరీస్ కి సులభంగా ఛార్జ్ చేయవచ్చు.







