OnePlus 15 5G స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 27 న చైనా లో లాంచ్ కి సిద్ధం అవుతుంది . 7300mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్ తో ఇండియా లో కి ఎప్పుడు రానుంది.

By Damodar Mandala

Updated On:

oneplus 15 5g mobile launch price in india launch date specs and features to expect

Join WhatsApp

Join Now

వన్ ప్లస్ మొబైల్ తయారీ సంస్థ అధికారికంగా తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 15 ను చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు తాజావార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి . ఈ స్మార్ట్‌ఫోన్ 27 అక్టోబర్ 2025 న చైనాలో వన్ ప్లస్ Ace 6 తో కలిసి విడుదల చేయనున్నారు . చైనా లాంచ్‌తో పాటు, OnePlus ఈసారి గ్లోబల్ మార్కెట్లో కూడా ముందుగానే ప్రవేశించ వచ్చునని జనవరి 2026 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ఒక టెక్ బజ్.

OnePlus 15 5G తో కంపెనీ శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, అధునాతన కెమెరా సిస్టమ్, సరికొత్త డిజైన్ మరియు మరెన్నో AI అప్‌గ్రేడ్ ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను ఈ సంవత్సరంలోని అత్యంత ఆకర్షణీయమైన ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలబెట్టనున్నాయి.

OnePlus 15 5G : లాంచ్ తేదీలు మరియు ధరలు

వన్ ప్లస్ 15 మొబైల్ చైనాలో ఈ నెల 27 అక్టోబర్ న లాంచ్ కానుందని అధికారికంగా వెల్లడించారు కాగా ఇండియా లో మాత్రం లాంచ్ నవంబర్‌లో జరగనున్నట్లు అంచన. గతంలో OnePlus తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను సాధారణంగా జనవరి ప్రారంభంలో విడుదల చేసేది, అయితే ఈసారి కంపెనీ తన లాంచ్ ప్లాన్‌ను ముందుకు మార్చినట్లు లీక్ సమాచారం.

వన్ ప్లస్ 15 5G మొబైల్ 16GB RAM మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చే అవకాశం వుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ధర ఇండియా లో రూ. 65,000 నుంచి రూ. 75,000 మధ్య ఉండవచ్చు . ప్రస్తతం అందుతున్న లీక్‌లు మరియు అప్‌గ్రేడ్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశముంది.

alsoRead : Oppo Find X9 Pro ని చైనా లో లాంచ్ చేసింది.7,500 mAh బ్యాటరీ, అత్యుత్తమ స్పెసిఫికేషన్స్ తో ఇండియా లో లాంచ్ ఎప్పుడంటే ?

OnePlus 15 5G: స్పెసిఫికేషన్స్

OnePlus 15 5G లో 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ ఉండి ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయని లీక్‌ ద్వారా తెలుస్తుంది.ఇది Pro XDR మరియు డాల్బీ విజన్ సపోర్ట్‌తో 1,800 nits బ్రైట్‌నెస్ అందిస్తుంది అని చూపిస్తున్నారు.

OnePlus 15 5G smartphone powered by Qualcomm Snapdragon 8 Elite Gen 5 processor
image Credits : Oneplus

ఇప్పటికే చెప్పినట్లుగా, వన్ ప్లస్ 15 క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ( Snapdragon 8 Elite Gen 5) కొత్త ప్రాసెసర్ తో రాబోతోంది. మొబైల్ ఆండ్రాయిడ్ (Android) 15 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం (Oxygen OS) 16 తో రన్ అవుతుందని చెప్తున్నారు.రేమ్ విషయంలో 12GB RAM / 16 GB RAM రెండు వేర్వేరు ఆప్షన్స్ లో 1TB వరకు స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది.

లీక్‌ అయిన సమాచారం ద్వారా  వన్ ప్లస్ 15 5G గేమింగ్ కోసం “విండ్ చీ గేమ్ కర్నల్ 2.0” అద్భుతమైన అప్‌గ్రేడ్‌ ఫీచర్ తో వస్తోంది. ఇది ఫోన్ వేడి తగ్గించి స్మూత్ పనితీరు అందిస్తుంది.

వన్ ప్లస్ 15 5G ఫోటోగ్రఫీ విషయంలో సరికొత్త అప్‌గ్రేడ్‌ లతో ఈసారి మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఫోన్‌లో సోనీ LYT 700 సెన్సార్ తో కూడిన 50 మెగాపిక్సల్స్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS) సపోర్ట్ తో వస్తోంది. 50 మెగాపిక్సల్స్ ఐఎస్ఓ సెల్ JN5 టెలిఫోటో కెమెరా మరియు 50 మెగాపిక్సల్స్ అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. అంతే కాకుండా ఫోన్‌లో AI కెమెరా ఫీచర్లు ఆబ్జెక్ట్ ఎరేజర్ (object eraser), ఫోటో బ్యాక్ గ్రౌండ్ పెంచుకోడానికి ( background enhancement ) మరియు ఇతర స్మార్ట్ ఆప్టిమైజేషన్ టూల్స్ కూడా అందించబడతాయని అంచన.

OnePlus 15 5G: 7,300 mAh బ్యాటరీ

చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు 7,300 mAh బ్యాటరీ ఉండి, అది 120W వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఫోన్ బాడీ ఏరోస్పేస్ గ్రేడ్ నానో సెరామిక్ మెటల్ ఫ్రేమ్‌తో తయారు అవుతుంది, ఇది స్క్రాచ్ రెసిస్టెంట్ గా ఉంటుంది.అలాగే ఈ స్మార్ట్ ఫోన్ డస్ట్, వాటర్ నుండి ప్రొటాక్షన్ కోసం IP68 రేటింగ్స్ ఇవ్వబడింది.

తాజాగా Weibo లో OnePlus విడుదల చేసిన టీజర్ల ప్రకారం సాండ్ స్టోర్మ్ ( Sand Storm ), అబ్ సాల్యూట్ బ్లాక్ (Absolute Black)మరియు మిస్ట్ పర్పుల్ (Mist Purple) కలర్స్ లో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.

FAQ

Q1. OnePlus 15 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
A1. వన్ ప్లస్ 15 5G అక్టోబర్ 27, 2025 న చైనాలో లాంచ్ కానుంది. ఇండియా లాంచ్ నవంబర్ 2025 లో           జరగనున్నట్లు లీక్ సమాచారం.

Q2. OnePlus 15 5G ధర ఇండియాలో ఎంత ఉంటుంది?
A2. ఈ ఫోన్ ధర భారత మార్కెట్‌లో ₹65,000 నుంచి ₹75,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

Q3. OnePlus 15 5G ఏ ప్రాసెసర్ తో వస్తుంది?
A3. ఈ ఫోన్ తాజా Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో రాబోతోంది, ఇది అద్భుతమైన         పనితీరు మరియు గేమింగ్ అనుభవం అందిస్తుంది.

Q4. OnePlus 15 5G లో బ్యాటరీ కెపాసిటీ ఎంత?
A4. వన్ ప్లస్ 15 5G లో 7,300mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W              వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

Q5. OnePlus 15 5G కెమెరా స్పెసిఫికేషన్లు ఏమిటి?
A5. ఈ మొబైల్‌లో సోనీ LYT-700 సెన్సార్‌తో 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో, మరియు 50MP            అల్ట్రా వైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment