రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలయింది..మొబైల్ చూసావా ?

By Damodar Mandala

Updated On:

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition features telugu

Join WhatsApp

Join Now

రియల్‌మీ15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ( Game of Thrones Limited Edition )బుధవారం భారతదేశం మరియు గ్లోబల్ మార్కెట్లలో విడుదలైంది.ఈ మొబైల్  జూలైలో లాంచ్ చేసిన Realme 15 Pro 5G  మోడల్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్‌ . కొత్త రియల్‌మీ హ్యాండ్‌సెట్‌లో స్టాండర్డ్ మోడల్‌ లో ఉన్న ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు అలాగే ఉంచి , మొబైల్ డిజైన్ లో మాత్రం HBO యొక్క Game of Thrones సిరీస్‌ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేకమైన మార్పులు ఉన్నాయి. ఈ ఫోన్‌లో వెనుక స్టైలిష్ నానో ఎన్‌గ్రేవ్డ్ మోటిఫ్స్ అంటే ఒక క్రాఫ్ట్ డిజైనింగ్ ని తలపించేలా  గేమ్ ఆఫ్ థ్రోన్స్  ముద్రలు చెక్క బడ్డాయి. మరియు ప్రత్యేకమైన యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) థీమ్‌లు ఉన్నాయి, ఇవి మొబైల్ కి మరింత ప్రీమియమ్ లుక్‌ను ఇచ్చాయి.

Realme 15 Pro 5G  Game of Thrones Limited Edition : ధర  మరియు అందుబాటు వివరాలు

ఇండియా లో రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ధర ₹44,999 గా నిర్ణయించబడింది. అయితే ఈ మొబైల్ ఒక్క 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. అయితే అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ లతో పేమెంట్ చేస్తే  ₹3,000 వారికి డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్ Flipkart లోను  మరియు దేశవ్యాప్తంగా ఉన్న రియల్‌మీ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లకు ఈ స్పెషల్ మొబైల్ ఎడిషన్ ను ఒక ప్రత్యేకమైన కలెక్టబుల్ ప్యాకేజింగ్‌ లో ఇస్తున్నారు ,మొబైల్ తో పాటు ఐరన్ థ్రోన్ ( Iron Throne) ఫోన్ స్టాండ్, కింగ్స్ హ్యాండ్ (King’s Hand )పిన్, వెస్ట్రోస్ (Westeros ) ప్రపంచం చిన్న సైజు మినీ మోడల్‌ , అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్రాండెడ్ స్టికర్లు, పోస్టుకార్డులు మరియు యాక్సెసరీలు ఈ ప్యాకేజింగ్‌ లో ఉంటాయి . ఈ Realme 15 Pro 5G Game of Thrones Limited Edition  సిరీస్ ప్రేమికులకు చాల బాగా నచ్చుతుంది. 

Realme 15 Pro 5G Game of Thrones Limited Edition theme mobile
image credit : realme

Realme 15 Pro 5G  Game of Thrones Limited Edition : థీమ్ డిజైన్ 

రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకమైన బ్లాక్ మరియు గోల్డ్ స్టైలింగ్‌ తో వస్తుంది. ఫోన్‌లోని కెమెరా ఐలాండ్ చుట్టూ త్రీడి లో డ్రాగన్ కాళ్ళు ఆకారం లో  బోర్డర్ మరియు సున్నితమైన నానో ఎన్‌గ్రేవ్‌డ్ మోటిఫ్స్ అంటే గేమ్ ఆఫ్ థ్రోన్ థీమ్ బ్యాక్గ్రౌండ్  చిన్న చిన్న ప్యాటర్న్‌ లు ఉంటాయి. ప్రతి లెన్స్ చుట్టూ ఆకర్షణీయమైన డెకరేటివ్ రింగులు ఉండగా, ఫోన్ దిగువ భాగంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌ లోని హౌస్ టార్గేరియన్ యొక్క చిహ్నమైన మూడు తలల డ్రాగన్ త్రీడి  సింబల్ ఉంటుంది . 

రియల్‌మీ కంపెనీ మొబైల్ కోసం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్‌లో కలర్ చేంజింగ్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. సాధారణంగా నల్లరంగులో ఉంటుంది, కానీ 42 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అగ్నిరంగు ( ఫైరీ రెడ్ )‌గా మారుతుంది. ఈ ఫీచర్  ఫోన్‌కి గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్‌కు తగిన విధంగా ప్రత్యేకమైన మరియు డైనమిక్ లుక్‌ను ఇస్తుంది.

రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌లో రెండు ప్రత్యేక థీమ్ కలర్స్ లో మొబైల్ ఫోన్స్  డిజైన్ చేసారు . ఒకటి ఐస్ థీమ్ ఇంకోటి డ్రాగన్ ఫైర్ థీమ్ . అంతేకాకుండా ఈ ఎడిషన్‌లో ప్రత్యేకమైన Game of Thrones వాల్‌పేపర్లు మరియు ఐకాన్‌లు కూడా ఇస్తారు , వీటితో ఫోన్‌ను పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

also Read : WhatsApp Update లో Username తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్ ; WhatsApp Message Translation ఫీచర్ కూడా అప్డేట్ చేస్తుంది.

Realme 15 Pro 5G  Game of Thrones Limited Edition : స్పెసిఫికేషన్లు

రియల్‌మీ 15 ప్రో 5G  స్టాండర్డ్ మోడల్‌లో స్పెసిఫికేషన్స్ తోనే  గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్‌ కూడా డిజైన్ చేసారు. ఫోన్‌లో 6.8 అంగుళాల 1.5K (2800×1280 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఉంటుంది, స్క్రీన్  144Hz రిఫ్రెష్ రేట్, 2,500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంటుంది మరియు 6,500 నిట్స్ వరుకు  పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను అందిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ( Corning Gorilla Glass) 7i  కూడా ఇవ్వబడింది. 
 
మొబైల్ పెరఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్‌కి శక్తినిచ్చేది  స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 4  (Snapdragon 7 Gen 4 SoC ) ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ( Android )15 ఆధారంగా రూపొందించిన Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony IMX896 ప్రైమరీ కెమెరా మరియు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వబడ్డాయి. ముందు వైపు  50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా  ఇచ్చారు . ఫొటోస్ , వీడియోస్ కోసం సరిపోయాయి అని చెప్పొచ్చు.
 
మొబైల్ కి  7,000 mAh సామర్థ్యమున్న పెద్ద బ్యాటరీ ఇచ్చారు , ఇది 80W  వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. USB Type C  చార్జర్ తో తక్కువ టైం లో ఛార్జింగ్ ని ఫిల్ చేసుకోవచ్చు . ఛార్జింగ్  కూడా ఎక్కువ సమయం వస్తుంది. రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ మొబైల్ కి IP66 + IP68 + IP69 రేటింగ్స్ ఉన్నాయి.  డస్ట్  ఇంకా వాటర్ బబ్బుల్స్ కోసం బయపడనక్కర్లేదు.  మొబైల్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది.  కనెక్ట్విటి విషయంలో మొబైల్ 4G , 5 G సపోర్ట్ తో ఇవ్వబడుతుంది.
 
FAQ
Q1. Realme 15 Pro 5G Game of Thrones Limited Edition  ప్రత్యేకత ఏమిటి  ?
         
A1. 42°C దగ్గర ఫైర్ రెడ్ కలర్ చేంజ్ అయ్యే  లెదర్ బ్యాక్ ప్యానెల్.  హౌస్ టార్గేరియన్ యొక్క చిహ్నమైన మూడు తలల డ్రాగన్ త్రీడి సింబల్, ఫోన్‌లోని కెమెరా ఐలాండ్ చుట్టూ  త్రీడి లో డ్రాగన్ కాళ్ళు ఆకారం లో ఉన్న బోర్డర్ తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ ని ప్రతిబింబిస్తుంది  .
 
Q2. రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్  ఎడిషన్ లో  బ్యాటరీ మరియు ఛార్జింగ్ ఫీచర్స్ ఏంటి ?
 
A2. మొబైల్ కి 7,000 mAh సామర్థ్యమున్న పెద్ద బ్యాటరీ  , 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్  ఉంది.
 
Q3. రియల్‌మీ 15 ప్రో 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్  మొబైల్ ఎన్ని థీమ్స్ కలర్స్ లో ఎవైలబుల్ వుంది ?
 
 A3. రెండు ప్రత్యేక థీమ్ కలర్స్ లో మొబైల్ ఫోన్స్ డిజైన్ చేసారు . ఒకటి ఐస్ థీమ్ ఇంకోటి డ్రాగన్ ఫైర్ థీమ్ .
 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment