రియల్మీ కంపెనీ తన హోమ్ కంట్రీ అయిన చైనా లో మంగళవారం జరిగిన ఈవెంట్ లో GT8 సిరీస్ ( Realme GT 8 Series )ను లాంచ్ చేసింది. ఈ రియల్మీ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ (Snapdragon )ప్రాసెసర్‌తో పాటు R1 X గ్రాఫిక్స్ చిప్ కూడా అమర్చారు. 2K రిజల్యూషన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే అమర్చబడింది. 7,000mAh భారీ బ్యాటరీతో పాటు స్మార్ట్‌ఫోన్ IP69, IP68 మరియు IP66 సర్టిఫికేషన్లు కలిగి ఉన్నాయి. అంతేకాదు కెమెరా హౌసింగ్ ని మీకు నచ్చినట్టు మార్చుకునే ఆప్షన్ ని రియల్మీ ఆఫర్ చేస్తుంది . మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
Realme GT 8 Series ధర వివరాలు
రియల్మీ GT 8 ప్రో 12GB RAM /256GB స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో CNY 3,999 ( ఇండియా కరెన్సీ లో సుమారు ₹50,000) నుండి ప్రారంభమవుతుంది. 16GB RAM / 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 4,299 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹53,000), 12GB RAM / 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 4,499 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹56,000) మరియు 16GB RAM /512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 4,699 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹58,000)గా నిర్ణయించబడింది. అంటే కాదు రియల్మీ GT 8 ప్రో 16GB RAM / 1TB స్టోరేజ్ వేరియంట్‌కి CNY 5,199 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹64,000) ధరను నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. గ్లోబల్ లాంచ్ వివరాలు కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
స్టాండర్డ్ మోడల్ రియల్మీ GT 8 యొక్క బేస్ వేరియంట్ అయిన 12GB RAM / 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 2,899 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹36,000)గా నిర్ణయించారు. ఇక 16GB RAM / 256GB స్టోరేజ్ మోడల్ ధర CNY 3,199 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹40,000), 12GB RAM / 512GB స్టోరేజ్ వేరియంట్ CNY 3,399 ( ఇండియా కరెన్సీ లో సుమారు ₹42,000), 16GB RAM / 512GB స్టోరేజ్ మోడల్ ధర CNY 3,599 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹45,000), అలాగే 16GB RAM / 1TB స్టోరేజ్ మోడల్ ధర CNY 4,099 (ఇండియా కరెన్సీ లో సుమారు ₹51,000) గా ఉంది.
Realme GT 8 Series స్పెసిఫికేషన్లు
Realme GT 8 Pro లో 6.79 అంగుళాల AMOLED డిస్ప్లే అమర్చబడింది . డిస్ప్లే క్వాడ్ హై డెఫినేషన్ 3,136 x 1,440 రిజల్యూషన్ 2K మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. GT 8 మోడల్ కూడా అదే డిస్ప్లే స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ రెండు మోడళ్లను బ్లూ, వైట్, మరియు గ్రీన్ కలర్ ఆప్షన్లలో కంపెనీ అందిస్తోంది.
కొత్త రియల్మీ GT 8 ప్రో మరియు GT 8 స్మార్ట్ఫోన్లు వరుసగా క్వాల్కమ్( Qualcomm) కంపెనీ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) మరియు స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్( Snapdragon 8 Elite )చిప్సెట్ లు కలిగి ఉంటాయి. అంతే కాదు గేమింగ్ సపోర్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి రియల్మీ R1 గేమింగ్ చిప్ ని వాడుతుంది. ఈ రెండు GT 8 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ( Android 16) ఆధారంగా Realme UI 7.0 మీద రన్ అవుతాయి. అలాగే ఈ రెండు Realme GT 8 Series స్మార్ట్ ఫోన్స్ కి 12GB/16GB RAM మరియు 265GB/512GB/ 1TB స్టోరేజ్ లో గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల కానున్నాయి.
also Read : వివో కంపెనీ Android 16 ఆధారంగా ఉన్న OriginOS 6 అప్డేట్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది. కొత్త ఫీచర్లు ఇవిగో

Realme GT 8 Series కెమెరా వివరాలు
Realme GT 8 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. మెయిన్ 50 మెగాపిక్సల్ కెమెరా Ricoh GR ఫోటో టోన్ల సపోర్ట్ తో వస్తుంది . ఇందులో ఐదు కొత్త Ricoh GR ఫోటో టోన్లను అందిస్తుంది పాజిటివ్, నెగిటివ్, హై కాంట్రాస్ట్ బ్లాక్ &వైట్, స్టాండార్డ్ మరియు మోనోక్రోమ్. 3x ఆప్టికల్ జూమ్ కలిగిన 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ లెన్స్ మరియు 50 మెగాపిక్సల్ అల్ట్రా-వైడ్ కెమెరా ముందువైపు 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా అమర్చబడ్డాయి.
కెమెరా హౌసింగ్‌లో రెండు Torx స్క్రూలు మరియు మాగ్నెటిక్ లాకింగ్ సిస్టమ్ ఇవ్వబడింది వీటి ద్వారా మొబైల్ కెమెరా హౌసింగ్ స్టైల్‌లను స్క్వేర్ (Square), రౌండ్ (Round), రోబోట్ (Robot) కి సులభంగా మార్చుకోవచ్చును.
Realme GT 8 Series బ్యాటరీ సామర్థ్యం
ఈ రెండు ఫోన్లలోనూ 7,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటుంది . ప్రో మోడల్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, స్టాండర్డ్ మోడల్ 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.GT 8 Pro మొబైల్ 8.2 మిల్లీమీటర్ మందం ఉండగా, GT 8 మొబైల్ 8.55 మిల్లీమీటర్ మందం కలిగి ఉంటాయి.







