Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ రూ.16 వేల డిస్కౌంట్ లో సేల్ నడుస్తుంది సూపర్ AMOLED డిస్ ప్లే ,50MP OIS కెమెరా, 5000mAh బ్యాటరీ!

By Damodar Mandala

Published On:

samsung galaxy a55 5g available with rs.16000 discount on amazon

Join WhatsApp

Join Now

Samsung Galaxy A55 5Gస్మార్ట్ ఫోన్ గత సంవత్సరం2024 మార్చి 11 నా ఇండియా మార్కెట్ లో కి అడుగుపెట్టింది.ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ AMOLED డిస్ ప్లే తో పాటు 50MP మెయిన్ కెమెరా , 32MP సెల్ఫీ కెమెరా కూడా వుంది . దానితో పాటు 5 సంవత్సరాల OS అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. 5,000 mAh సామర్థ్యమైన బ్యాటరీ మరియు 25W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు దాదాపు రూ 16000 డిస్కౌంట్ తో అమెజాన్ లో అందుబాటు లో ఇప్పుడు ఉంది. మీరు కనుక తక్కువ ధర లో మొబైల్ కొనుగోలు చేయాలి అని ప్రస్తుతం అనుకుంటుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అని చెప్తాను. పూర్తి వివరాలు చూసి నిర్ణయం తీసుకోండి.

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ రూ.16 వేల డిస్కౌంట్ వివరాలు

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ విడుదల సమయంలో 8GB RAM /128GB స్టోరేజి కలిగిన వేరియెంట్ ధర రూ.39999 గా ఉండేది.8GB RAM / 256GB స్టోరేజీ ఫోన్ రూ.42999 మరియు 12GB RAM/ 256GB స్టోరేజీ ఫోన్ రూ.45999 ధర లో మార్కెట్ లో విడుదల చేసారు . అయితే ప్రస్తుతం ఈ మొబైల్ నీ రూ .16000 డిస్కౌంట్ లో amazon సేల్ అందిస్తుంది.

రూ .40.000 కలిగిన 8GB RAM /128GB స్టోరేజి తో ఈ మొబైల్ ఇప్పుడు రూ.23,999, రూ.25,999, రూ.28999 ధరలకు అమెజాన్ ప్లాటుఫార్మ్ లో లభిస్తుంది. అంటే సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G బేస్ వేరియెంట్ పైన రూ.16 వేల డిస్కౌంట్ లో కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మిగతా రెండు వేరియెంట్ లు రూ.16 వేల డిస్కౌంట్ తగ్గింపు ధర నడుస్తుంది. బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ను కూడా పొందవచ్చు.

also Read : Realme GT 8 Series స్మార్ట్ ఫోన్స్ 7,000mAh బ్యాటరీ, R1 గేమింగ్ చిప్, మూడు రకాల కెమెరా హౌసింగ్ చేంజ్ కిట్ తో ఇండియాలోకి త్వరలో

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ చేసే 6.6 ఇంచిలా Super AMOLED డిస్ ప్లే ఉంటుంది . ఇది 1080 x 2340 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ హై బ్రైట్‌నెస్‌ 1,000 నిట్స్‌ వరకు ఉండడం వల్ల సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. డిస్ ప్లే ను Corning Gorilla Glass Victus+ ప్రోటాక్షన్ ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో పాటు గ్లాస్ బ్యాక్ డిజైన్‌లో వస్తుంది. బరువు సుమారు 213 గ్రాములు.

ఈ స్మార్ట్ ఫోన్ లో Exynos 1480 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.అంతే కాదు గ్రాఫిక్స్‌ కోసం AMD తో కలసి అభివృద్ధి చేసిన Xclipse 530 GPU ని జతచేసారు. ఇది గేమింగ్‌ మరియు గ్రాఫిక్స్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్‌ 8GB /12GB RAM వేరియంట్లలో లభిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్‌ విషయానికి వస్తే 128GB/ 256GB లో ఉన్నాయి. అలాగే 1TB వరకు మైక్రో SD కార్డ్‌ను ఉపయోగించి స్టోరేజ్‌ను పెంచుకోవచ్చును.
 
Samsung Galaxy A55 5G మొబైల్ ఆండ్రాయిడ్ (Android) 14 ఆధారంగా పనిచేసే Samsung One UI 6.1 ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. అప్‌డేట్స్ విషయానికి వస్తే సామ్‌సంగ్ ఈ ఫోన్‌కు 4 ప్రధాన OS అప్‌డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ పాచెస్ ఇవ్వబోతోంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్‌లో సామ్‌సంగ్ క్నోస్ వాల్ట్ (Samsung Knox Vault) ప్రొటాక్టు సిస్టమ్ మరియు ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్స్ ఇవ్వబడ్డాయి.
samsung galaxy a55 5g camera setup
image cerdits : samsung

Samsung Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ కెమెరా సెటప్ & బ్యాటరీ

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ (OIS) సపోర్ట్ లో ఇవ్వబడింది. ఫోటోలు మరియు వీడియోలు షేక్ అవ్వకుండా క్లారిటీ మిస్ కాకుండా తీయడానికి సహాయపడుతుంది. 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 123° ఫీల్డ్ ఆఫ్ వ్యూ సపోర్ట్ తో వైడ్ లెంగ్త్ సీన్స్ క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది. 5మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంటుంది . అలాగే మొబైల్ ముందు భాగంలో 32మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అమర్చబడింది.

సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ లో 5,000 mAh సామర్థ్యమైన బ్యాటరీ ఉంది. దీనికి 25వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఛార్జర్‌ను ప్యాకేజ్‌లో ఇవ్వరు .దానిని విడిగా కొనుగోలు చేయాలి. అలాగే ఈ ఫోన్‌ దుమ్ము , బయట నుంచి వాటర్ నుండి ప్రొటక్షన్ IP67 రేటింగ్‌ కలిగి ఉంది.
 
FAQ
Q1. Samsung Galaxy A55 5G ఎప్పుడు లాంచ్ అయింది?
A1. సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G 2024 మార్చి 11న భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయింది.
 
Q2. సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G ఫోన్‌ ధర ఎంతగా ఉంది మరియు ప్రస్తుతం ఎంత తగ్గింపులో అందుబాటులో ఉంది?
A2. లాంచ్ సమయంలో ప్రారంభ ధర ₹39,999గా ఉండగా, ప్రస్తుతం అమెజాన్‌లో ₹16,000 డిస్కౌంట్‌తో కేవలం ₹23,999కే లభిస్తోంది.
 
Q3. Samsung Galaxy A55 5Gలో ఛార్జర్ ఇస్తారా?
A3. లేదు, ప్యాకేజ్‌లో ఛార్జర్ ఇవ్వరు. మీరు విడిగా 25W ఫాస్ట్ ఛార్జర్‌ను కొనుగోలు చేయాలి.
 
Q4. ఈ మొబైల్‌కి ఎంతకాలం OS మరియు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తారు?
A4. సామ్‌సంగ్ ఈ ఫోన్‌కి 4 ప్రధాన Android OS అప్‌డేట్స్ మరియు 5 సంవత్సరాల సెక్యూరిటీ పాచెస్ ఇస్తుంది.
 
Q5. Samsung Galaxy A55 5G వాటర్‌ప్రూఫ్ ఫోన్‌నా?
A5. ఈ ఫోన్‌కి IP67 రేటింగ్ ఉంది, అంటే ఇది దుమ్ము మరియు నీటి చినుకుల నుండి రక్షణ కల్పిస్తుంది, కానీ పూర్తిగా వాటర్‌ప్రూఫ్ కాదు.
 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment