వివో కంపెనీ Android 16 ఆధారంగా ఉన్న OriginOS 6 అప్‌డేట్ టైమ్‌లైన్‌ను ప్రకటించింది. కొత్త ఫీచర్లు ఇవిగో

By Damodar Mandala

Published On:

vivo reveals android 16 based originos 6 update timeline for india

Join WhatsApp

Join Now

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Vivo తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ( Android) 16 ఆధారంగా పనిచేసే ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OriginOS 6) అప్‌డేట్‌కు సంబంధించిన విడుదల టైమ్‌లైన్‌ను విడుదల చేసింది.వివో వెల్లడించిన వివరాల ప్రకారం OriginOS 6 వినియోగదారులకు మరింత స్మూత్, వేగవంతమైన మరియు ఎఫిషియెంట్ అనుభవం ఇవ్వగలదు అని చెప్తున్నారు.

ఇందులోని యాప్ లాంచ్ స్పీడ్, ఫ్రేమ్‌రేట్ స్టెబిలిటీ, టచ్ రెస్పాన్స్ మెరుగుపరచడమే కాకుండా నేచురల్ యానిమేషన్లు మరియు కస్టమైజేషన్ ఫీచర్లు కూడా చాలానే ఉంటాయి.ఈ ఇంటర్‌ఫేస్ డిజైన్ నేచర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రూపొందించారంటా. అంతేకాకుండా వివో AI ఇప్పుడు గూగుల్ యొక్క Gemini తో ఇన్టిగ్రేట్ అయి యూజర్ల ప్రొడక్టివిటీని పెంచి గాడ్జెట్స్ మధ్య సపోర్ట్ ని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ అప్‌డేట్ ద్వారా సెక్యూరిటీ , పవర్ ఎఫిషియెన్సీ మరియు డివైస్ లైఫ్ స్పాన్ మరింత పెంచగలవు అని చెప్తున్నారు.

OriginOS 6 అప్‌డేట్ భారత దేశంలో విడుదల టైమ్‌లైన్‌

ఈ అప్‌డేట్ చైనాలో10 అక్టోబర్ 2025 న ప్రారంభించబడింది. అయితే భారతదేశం లో వినియోగదారులకు ఈ ఓస్ అప్డేట్ 2025 నవంబర్ ప్రారంభమై దశలవారీగా అన్ని వివో మొబైల్స్ కి అందించబడుతుంది అని తెలిపింది.

అందిన టెక్ సమాచారం ప్రకారం Vivo X200 సిరీస్ ఫోన్లకు ఈ అప్‌డేట్‌ను మొదటగా అందిస్తున్నారు. ఆ తర్వాత రాబోయే నెలల్లో ఫ్లాగ్‌షిప్ మరియు మిడ్ రేంజ్ మోడల్స్‌కు ఈ అప్‌డేట్ ను దశలవారీగా అందిస్తారు. అయితే మొత్తం అన్నిఅర్హత కలిగిన వివో మోడల్స్ కి 2026 మొదటి అర్ధభాగంలో గా అందిస్తామని వివో చెప్పుకొచ్చింది.

కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం భారతదేశంలో ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టం(OriginOS 6) అప్‌డేట్ దశలవారీగా విడుదల కానుంది. 2025 నవంబర్ ప్రారంభంలో ఈ అప్‌డేట్ Vivo X200 సిరీస్, Vivo X Fold 5, మరియు Vivo V60 ఫోన్లకు ముందుగా అందుబాటులోకి రానుంది . ఆ తరువాత 2025 నవంబర్ మధ్యలో Vivo X100 సిరీస్ మరియు Vivo X Fold 3 Pro మోడళ్లకు ఈ అప్‌డేట్ విడుదల చేస్తారు.

ఆ తరువాత 2025 డిసెంబర్ మధ్యలో OriginOS 6 అప్‌డేట్ తరువాత దశలో మరికొన్ని వివో మోడళ్లకు విడుదల చేయనున్నారు. ఈ దశలో Vivo V60e, Vivo V50, Vivo V50e, అలాగే Vivo T4 Ultra, Vivo T4 Pro, మరియు Vivo T4R 5G మోడల్ ఫోన్స్ అప్‌డేట్‌ను పొందబోతున్నాయి.

వచ్చే సంవత్సరం 2026 మొదటి అర్ధభాగంలో OriginOS 6 చివరి దశ అప్‌డేట్ లో మరిన్ని వివో స్మార్ట్‌ఫోన్‌లకు విడుదల చేస్తారు. ఈ దశలో Vivo X90 సిరీస్, Vivo V40, Vivo V30 సిరీస్, అలాగే Vivo T4 5G, T4x 5G, T3 సిరీస్ ఫోన్లు అప్‌డేట్ పొందుతాయి. అలాగే Vivo Y400, Y300 5G, Y200 సిరీస్ లు Vivo Y100, Y100A, Y58 5G, మరియు Y39 5G మోడళ్లకు కూడా ఈ అప్‌డేట్ అందించబడుతుంది.

alsoRead : OnePlus 15 5G స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 27 న చైనా లో లాంచ్ కి సిద్ధం అవుతుంది. 7300mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్ తో ఇండియా లో కి ఎప్పుడు రానుంది.

OriginOS 6 లో కొత్తదనం ఏంటి ?

వివో డెవలపర్ కాన్ఫరెన్స్ 2025 లో మొదట ప్రవేశ పెడుతున్నఈ కొత్త OriginOS 6 ఇంటర్‌ఫేస్ లో పర్ఫార్మెన్స్ మరియు డిజైన్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇందులోని Origin Smooth Engine టెక్నాలజీ సిస్టమ్‌ను మరింత స్మూత్‌గా, వేగంగా స్పందించేలా చేస్తుంది. అంతేకాకుండా అల్ట్రా కోర్ కంప్యూటింగ్ , మెమొరీ ఫ్యూషన్ టెక్నాలజీ కలపడం వల్ల భారీ రీసోర్స్ అవసరమయ్యే టాస్క్ లను కూడా మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి.

వివో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ అప్‌డేట్ ద్వారా యూజర్లు 5,000 ఫోటోల వరకు ఉన్న ఆల్బమ్‌లను కొన్ని సెకండ్లలోనే ఓపెన్ చేయగలరు. అలాగే డేటా లోడింగ్ వేగం ముందు ఉన్నవెర్షన్‌తో పోలిస్తే 106% పెరుగుతుందని సంస్థ తెలిపింది. అంతే కాకుండా యూసర్ ఇంటర్ ఫేస్ (UI) లో గ్రాఫిక్స్ పనితీరును ను మెరుగు పరిచారు. ఈ సిస్టమ్‌లో మొదటిసారిగా Vivo Sans ఫాంట్ ను పరిచయం చేస్తున్నారు. ఈ ఫాంట్ 40 కంటే ఎక్కువ భాషలకు సపోర్ట్ చేస్తుంది.

OriginOS 6 లో ఉపయోగిస్తున్న Origin Island అనే కొత్త ఫీచర్

ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టమ్ 6 లో Origin Island అనే ముఖ్యమైన ఫీచర్ ని వివో తీసుకొస్తుంది. ఈ ఫీచర్ యూజర్‌కి రియల్ టైమ్ సజెషన్స్ మరియు లైవ్ యాక్టివిటీ సమాచారం అందించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు మ్యూజిక్ కంట్రోల్స్, కాపీ చేసిన నంబర్లకు ఇమిడియట్ కాల్ లేదా మెసేజ్ షార్ట్కట్స్ మరియు మీటింగ్ రీమైండర్స్, వన్ ట్యాప్ జాయిన్ బటన్ వంటి ఫీచర్లు కూడా జత చేసారు.

OriginOS 6 అప్‌డేట్ తో ఆండ్రాయిడ్(Android) డివైస్ ని Apple డివైస్ తో క్రాస్ డివైస్ కనెక్టివిటీ చేసుకోవచ్చని వివో వెల్లడించింది. దీని ద్వారా Android మరియు iOS ఎకోసిస్టమ్‌ల మధ్య బ్రిడ్జ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

అయితే ఇప్పటివరకు చైనీస్ వినియోగదారులు మినహా అంతర్జాతీయ వివో వినియోగదారులు OriginOS 5 ను ఉపయోగించట్లేదు . ఇప్పుడు వస్తున్న ఈ అప్‌డేట్ అన్ని గ్లోబల్ వివో మోడల్స్ లో ఇప్పటివరకు ఉపయోగిస్తున్న Funtouch OS 15 ని రీప్లేస్ చేసి, యూజర్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచ గలదని ఆశిద్దాం.

FAQ

Q1. Vivo OriginOS 6 అప్‌డేట్ భారత్‌లో ఎప్పుడు వస్తుంది?
A1. వివో కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం OriginOS 6 అప్‌డేట్‌ 2025 నవంబర్ మొదట్లో భారత వినియోగదారులకు విడుదల అవుతుంది. ఇది దశలవారీగా అన్ని అర్హత కలిగిన Vivo మొబైల్స్‌కి 2026 మొదటి అర్ధభాగంలో పూర్తిగా అందుతుంది.

Q3. OriginOS 6 లో ఉన్న ముఖ్యమైన కొత్త ఫీచర్లు ఏమిటి?
A3. కొత్త Origin Smooth Engine వల్ల సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. Origin Island ఫీచర్‌ ద్వారా రియల్ టైమ్ సజెషన్స్‌, లైవ్ యాక్టివిటీలు అందిస్తాయి. అలాగే కొత్త Vivo Sans ఫాంట్‌, మెరుగైన గ్రాఫిక్స్‌, మరియు Android మరియు Apple క్రాస్ డివైస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment