WhatsApp Security Features : మీ WhatsApp చాట్ భద్రముగా ఉంచుకోండిలా ?

By Damodar Mandala

Published On:

Whatsapp security features here are the details

Join WhatsApp

Join Now

WhatsApp అంటూ ప్రతీఒక్కరిని పరిచయం చేస్తూ అందరిని ఒకే ప్లాటుఫార్మ్ మీద కలుపుతుంది WhatsApp అప్లికేషన్ . అందరం ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత చాట్స్‌, బిజినెస్ సమాచారం WhatsApp లో ప్రతిరోజూ షేర్ చేస్తూనే ఉన్నాం. అయితే WhatsApp తమ యూజర్ల డేటాను కాపాడేందుకు ఎన్నో శక్తివంతమైన భద్రతా ఫీచర్‌లు అందిస్తోంది. ఈరోజు WhatsApp లో ఉన్న ముఖ్యమైన Privacy, Security, మరియు Safety ఫీచర్లను సింపుల్ గా, క్లియర్ గా తెలుగు లో తెలుసుకుందాం.

WhatsApp Security Features : End-to-End Encryption బెస్ట్ ఫీచర్

వాట్సాప్ లో End-to-End Encryption ఎలా పనిచేస్తుందో తెలుసా ? వాట్సాప్ మీరు పంపిన సింపుల్ Plain Text అంటే సింపుల్ టెక్స్ట్ ని Cipher Text అంటే ఎవరు చదవలేని విధంగా ఒక కోడ్ లా మారుస్తుంది. మీ పంపిన మెసేజ్ నీ మీరు పంపిన రిసీవర్ దగ్గర మాత్రమే Decrypt అంటే మళ్ళీText గా చూపిస్తుంది . మధ్యలో WhatsApp servers కి కీ ఉండదు.వాట్సాప్ కూడా మీ మెసేజ్ చదవలేదు. Storage లో కూడా మెసేజ్ encrypted రూపంలోనే ఉంటుంది.కాబట్టి హ్యాకర్ WhatsApp serverను hack చేసినా, messages open చేయలేడు.

WhatsApp Two-Step Verification settings page with PIN and email optionsWhatsApp Security Features : Two-Step Verification 

వాట్సాప్ లో ఈ ఫీచర్ ఇంకో సెక్యూరిటీ పిన్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. 6 digit PIN ఎనేబుల్ చేసుకోవటం వల్ల మీ WhatsApp ని కొత్త మొబైల్ లో లాగిన్ చేయాలని ప్రయత్నిస్తే ఈ పిన్ లేకపోతే చేయలేరు.

వాట్సాప్ లో Two-Step Verificationఎలా చేసుకోవాలి ?

  • Step 1: WhatsApp తెరిచిSettings (పైన కుడి వైపు మూడు డాట్స్ → Settings) ఓపెన్ చేయండి.
  • Step 2: Account అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
  • Step 3: అక్కడ Two-step verification అనే ఆప్షన్ కనిపిస్తుంది → దానిపై టాప్ చేయండి.
  • Step 4: ఇప్పుడు Enable బటన్‌ను క్లిక్ చేయండి.
  • Step 5: మీరు గుర్తు పెట్టుకోగలిగే ఒక 6-digit PIN టైప్ చేయండి.
  • Step 6:అదే PIN‌ను మళ్లీ టైప్ చేసి Confirm చేయండి.
  • Step 7: ఇప్పుడు WhatsApp మీకు Email address అడిగుతుంది. Email ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు PIN మర్చిపోతే, Email ద్వారా రీసెట్ చేసుకోవచ్చు.మీ Email టైప్ చేయండి. Confirm చేయండి.
  • Step 8: Done! Two-Step Verification మీ WhatsApp లో ఆన్ అయ్యింది.

WhatsApp Chat Lock feature screen showing locked chats folder

WhatsApp Security Features: Chat Lock 

చాట్ లాక్ అనేది మీరు ప్రైవసీ గా ఉంచాలి అనుకునే చాట్ ని Fingerprint / Face Unlock / Password తో లాక్ చేసి, మీ ఫోన్‌లో ఇతరులకు కనిపించకుండా ప్రొటాక్టు చేసుకోడానికి  WhatsApp Security Features లో చెప్పుకోదగ్గది.

  • Step 1: WhatsApp ఓపెన్ చేయండి.
  • Step 2: లాక్ చేయాలనుకున్న చాట్‌ను ఓపెన్ చేయండి. (వ్యక్తి చాట్ లేదా గ్రూప్ చాట్ రెండూ కూడా లాక్ చేయొచ్చు.)
  • Step 3: పైన ఉన్న పేరు (contact name / group name) పై టాప్ చేయండి.
  • Step 4: చాట్ ఇన్ఫో పేజీలో కిందకు స్క్రోల్ చేయండి.మీకు Chat Lock అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేయండి.
  • Step 5: Lock this chat with fingerprint / Face ID / device unlock అనే ఆప్షన్ వస్తుంది.దాన్ని Enable చేయండి.
  • Step 6: మీ ఫోన్ fingerprint / face unlock ద్వారా ఓనర్‌ను verify చేస్తుంది.వెంటనే Chat Lock ఆన్ అవుతుంది.
Locked Chats ఎక్కడ కనిపిస్తాయి?
మీ మైన్ WhatsApp Home Screen లోChats తెరిచి స్క్రీన్‌ని కొంచెం కిందికి pull చేయండి.Locked Chats అనే ఒక special folder కనిపిస్తుంది. అక్కడ మీ PIN / Fingerprint / Face ID తో మాత్రమే ఓపెన్ అవుతుంది.
 
 
View Once Messages ఫీచర్ :  WhatsApp లో View Once Photos & Videos అంటే పంపిన వ్యక్తి చూసిన వెంటనే ఆ మీడియా ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది.WhatsApp Security Features లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. 
 
Disappearing Messages ఫీచర్ : ఈ డిస్ అప్పీరింగ్ మెసేజెస్ ఆప్షన్ పెట్టి మీ మెసేజెస్ ని ఎన్ని రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ చేయాలి అని మీరు డిసైడ్ చేయవచ్చు. మీ మెసేజీలు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు తర్వాత అనే ఆప్షన్ లు ఇందులో ఉంటాయి.
 
Device Verification & Account Protect :వాట్సాప్ ఇప్పుడు కొత్త డివైస్ వెరిఫికేషన్ సిస్టం (Device Verification System )ఉపయోగిస్తోంది. దానిని వాట్సాప్ సర్వర్ ప్రతిసారి లాగ్ ఇన్ టైం లో match చేస్తుంది.
ఏదైనా fake ఆక్టివిటీ కనిపిస్తే WhatsApp వెంటనే block చేస్తుంది. అలాగే వాట్సాప్ ను కొత్త ఫోన్లో install చేసినప్పుడు, పాత డివైస్ లోకి కూడా ఒక notification పంపుతుంది. ది మీరు కాదా?” అని అడుగుతుంది. మీరు అనుమతించకపోతే, కొత్త డివైస్‌తో login అవ్వడం అసాధ్యం WhatsApp Security Features లో ఇది చెప్పుకోదగ్గది.
 
Profile Privacy Controls సెట్టింగ్స్ : మీ సమాచారం ఎవరికి కనిపించాలి అని మీరు నిర్ణయించవచ్చు.Profile Photo,Last Seen,Online Status, About, Status updatesఎవరికి కనిపించాలనే దాన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. Everyone, My Contacts, My Contacts Except అని ఆప్షన్స్ ని మీరు పెట్టుకోవచ్చును.
 
Block & Report Features సెట్టింగ్ : అనవసరమైనవారిని ఒక్క క్లిక్‌తో STOP చేసుకోవచ్చు. స్పామ్ మెసేజెస్, అన్నోన్ కాంటాక్ట్స్ మీకు distub చేస్తే వెంటనే Block మరియు Report చేసుకోవచ్చు. ఇవి WhatsApp community safety కి చాలా ఉపయోగపడతాయి.
 

WhatsApp Security Features: Link Device Security 

వాట్సాప్ వెబ్ (WhatsApp Web) ద్వారా మీరు మీ మొబైల్ వాట్సాప్ ని Link Device చేసే టప్పుడు పబ్లిక్ కంప్యూటర్ సెంటర్ లో లింక్ చేస్తే పని అయిన వెంటనే logout చేయటం మంచిది. సాధ్యమైనంత వరకు పర్సనల్ PC/LAPTOP లో మాత్రమే WhatsApp Web వాడండి.
 
Password-Protected Backups : మీ చాట్ హిస్టరీ కూడా ప్రొటాక్టు చేసుకోగలరు. Google Drive / iCloud backup కి కూడా మీరు పాస్వర్డ్ ప్రొటాక్షన్ పెట్టుకోవచ్చు.
 
Unknown Calls Silence : వాట్సాప్ voice calls ద్వారా spam ఎక్కువగా పెరుగుతున్నప్పుడు WhatsApp ఒక కొత్త ఫీచర్ ఇచ్చింది. ” Silence Unknown Callers” దాన్ని ON చేస్తే మీ contacts లో లేని వాళ్ళ calls అట్టే ring అవవు . కానీ call history లో మాత్రం కనిపిస్తాయి. WhatsApp Security Features లో కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ .
 
ముగింపు మీ WhatsApp ని సురక్షితం గా ఉంచుకోవడానికి మీ OTP ఎవరికీ చెప్పొద్దు, Unknown links click చేయొద్దు. Unknown files download చేయొద్దు. WhatsApp mod apps (GB WhatsApp etc.) వంటివి వాడొద్దు.
 

welcome to Gadvio 👋
It’s nice to meet you.

Sign up to receive awesome content in your inbox, every Week.

We don’t spam! Read our privacy policy for more info.

Damodar Mandala

నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.

Leave a Comment