వాట్సాప్ త్వరలో యూజర్లు తమ యూజర్‌నేమ్ (Username) ని రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది . ప్రస్తుతం మెసేజ్ అనువాదం (Message language translation) ఫీచర్ ని కూడా ఆడ్ చేస్తునట్టు టెక్ సమాచారం . కొత్త WhatsApp Update న్యూస్ ప్రకారం వాట్సాప్ త్వరలో యూజర్‌నేమ్ ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీంతో యూజర్లు తమ మొబైల్ నంబర్ లేకుండానే యూజర్‌నేమ్ ద్వారా ఇతరులతో చాట్ చేయగలుగుతారు.
WhatsApp Update : యూజర్‌నేమ్ ఫీచర్
2009లో ప్రారంభమైనప్పటి నుండి దాదాపు పదేళ్లకు పైగా వాట్సాప్ యూజర్ రిజిస్ట్రేషన్ మరియు కాంటాక్ట్ డిస్కవరీ కోసం ఫోన్ నంబర్‌ను తప్పనిసరి చేసింది.ఇప్పుడు, కొత్త యూజర్‌నేమ్ సిస్టమ్ ద్వారా యూజర్లకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ మరియు ప్రైవసీ లభించనుంది.
యూజర్ డిజిటల్ ఐడెంటిటీని సురక్షితం గా ఉంచడం కోసం మరియు దీర్ఘకాలంగా WhatsApp యూజర్ల కి అనవసరమైన సందేశాలను తగ్గించేందుకు యూజర్‌నేమ్ PIN సెటప్ చేసే ఫీచర్నుతీసుకురావనని చర్చలు కొనసాగుతున్నాయి . WhatsApp Android యాప్‌లో యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే ఆప్షన్‌ను టెస్ట్ చేయడం ద్వారా ఆ ఫీచర్ విడుదలకు ఒక అడుగు ముందుకు వేయినట్లుంది. ఫీచర్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం, యూజర్లు పూర్తి యూజర్‌నేమ్ ఫంక్షనాలిటీ అందుబాటులోకి రాకముందే తమ ఇష్టమైన యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్తుంది.
image credit : WABetaInfo
పైన ఉన్న స్క్రీన్‌షాట్ ఆధారంగా, WhatsApp సెట్టింగ్స్‌లోని ప్రొఫైల్ టాబ్‌లో యూజర్‌నేమ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. యూజర్లు ఈ ఆప్షన్ ద్వారా తమ యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ లో యూజర్‌నేమ్‌ల పరిచయానికి ఒక అడుగుగా చెప్పబడుతోంది.
అందులో యూజర్‌నేమ్ ” కీ ” ఆప్షన్ కూడా ఉండనుందని భావిస్తున్నారు, ఇది ఎవరు మీకు మెసేజ్ చేయగలరో పరిమితం చేస్తుంది, తద్వారా అనవసరమైన సందేశాలు తగ్గుతాయి. కేవలం మీ యూజర్‌నేమ్‌తో పాటు “ కీ ” ఉన్నవారికి మాత్రమే WhatsApp లో మీకు మెసేజ్ చేయగలరు.
WhatsApp Update ఫీచర్‌లను దశలవారీగా విడుదల చేస్తారు కాబట్టి, యూజర్ నేమ్‌లను రిజర్వ్ చేసుకోవడం, యూజర్లకు తమ ఇష్టమైన యూజర్‌నేమ్‌ను ముందుగానే ఎంచుకునే అవకాశం వాట్సాప్ ఇస్తుంది. దీనివల్ల ఇతరులు ముందే దాన్ని తీసుకోకుండా ఉండటం మరియు న్యాయవంతమైన రోలౌట్ సాధ్యమవుతుంది.
WABetaInfo ప్రకారం, యూజర్‌నేమ్ సెట్ చేసుకోవడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇటీవల జరిగిన కోడ్ విశ్లేషణ ద్వారా WhatsApp కొత్త యూజర్‌నేమ్‌ల కోసం కఠినమైన ఫార్మాటింగ్ నియమాలను అమలు చేస్తోందని తెలిసింది. ఈ నియమాలు స్టాండర్డైజేషన్ మరియు సెక్యూరిటీని కాపాడడానికి ఉద్దేశించబడ్డాయి.
వెబ్‌సైట్ అడ్రస్సులతో గందరగోళం రాకుండా ఉండేందుకు గాను యూజర్‌నేమ్ “www.” తో ప్రారంభం కావొద్దు
యూజర్‌నేమ్‌లో కనీసం ఒక అక్షరం తప్పనిసరిగా ఉండాలి, కేవలం నంబర్లు లేదా సింబల్స్‌తో మాత్రమే ఉండకూడదు.
కేవలం చిన్న అక్షరాలు (a–z), సంఖ్యలు (0–9), పీరియడ్స్ (.), మరియు అండర్‌స్కోర్లు (_) మాత్రమే అనుమతించబడతాయి.
అయితే రిజర్వేషన్ ఫీచర్ లేదా పూర్తి యూజర్‌నేమ్ సిస్టమ్ కోసం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విడుదల తేదీని WhatsApp ప్రకటించలేదు. ఇది బీటా వెర్షన్‌లో కనిపించడం, ఈ ఫీచర్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉందని సూచిస్తోంది.
వాట్సాప్ 180 కంటే ఎక్కువ దేశాల్లో 3 బిలియన్లకు పైగా యూజర్లతో, ప్రపంచంలోని ఎక్కడ ఉన్నా వారిని దగ్గరగా కనెక్ట్‌గా ఉంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తోంది . అయితే, కొన్ని సార్లు భాష ఒక అడ్డంకిగా మారి, పనులు చేయడంలో లేదా మన భావాలను సరిగ్గా ఇతరులకి వ్యక్తపరచడంలో ఇబ్బంది కలిగించవచ్చు అనే విషయం పై వాట్సాప్ ప్రత్యేక దృష్టి పెట్టింది .అందుకే ఇప్పుడు WhatsApp లో మెసేజ్ అనువాదం (Message Translations) ఫీచర్‌ను కొత్తగా తెస్తుంది. దీని ద్వారా రెండు వేరు వేరు బాషల గల వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ సులభం చేస్తున్నారు.
WhatsApp Update : వాట్సాప్ మెసేజ్ ట్రాన్సలేషన్స్ ఎలా చేయాలి ?
మీకు తెలియని భాషలో మెసేజ్ కనిపిస్తే, ఇప్పుడు మీరు ఆ మెసేజ్‌పై లాంగ్‌ప్రెస్ చేసి ‘Translate’ (అనువదించు) అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయవచ్చు.
తర్వాత, ఆ మెసేజ్‌ను ఏ భాష నుండి లేదా ఏ భాషకు అనువదించాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి.
ఒకసారి ఆ భాషను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, భవిష్యత్తులో కూడా ఆ భాషలోని మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా అనువదించబడతాయి.
ఈ ఫీచర్ ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే చాట్స్ అయిన, గ్రూప్స్ , అలాగే ఛానల్ అప్‌డేట్స్ లో కూడా పనిచేస్తుంది. ఇంకా Android యూజర్లు మొత్తం చాట్ థ్రెడ్‌కు ఆటోమేటిక్ అనువాదం (Automatic Translation) ఆన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఆ చాట్‌లో భవిష్యత్తులో వచ్చే అన్ని మెసేజ్‌లు కూడా ఆటోమేటిక్‌గా అనువదించబడతాయి . మెసేజ్ అనువాదాలు ప్రైవసీని రక్షించే విధంగా రూపొందించబడ్డాయి అని వాట్సాప్ చెప్తుంది. వాట్సాప్ ఆ అనువాదాలను చూడలేదు మరియు యాక్సెస్ చేయలేదు.
ఈ ఫీచర్‌ను Android మరియు iPhone యూజర్లకు ఈరోజు నుండి క్రమంగా దశలవారీగా అందిస్తున్నారు. మొదట కొన్ని ఎంపిక చేసిన భాషలలో ప్రారంభమై, తరువాత మరిన్ని భాషలకు విస్తరించబడుతుంది. Android యూజర్లకు ఇది ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, మరియు అరబిక్ వంటి 6 భాషల్లో అందుబాటులో ఉంటుంది. iPhone యూజర్లకు ఈ ఫీచర్ 19 కంటే ఎక్కువ భాషల్లో ప్రారంభమవుతుంది .
ఈ వాట్సాప్ అప్డేటెడ్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించిందో comment లో తెలియచేయండి .
FAQ
Q1. WhatsApp Update లో యూజర్‌నేమ్ ఫీచర్ ఏమిటి?
A1. WhatsApp త్వరలో యూజర్లు ఫోన్ నంబర్ లేకుండానే యూజర్‌నేమ్ ద్వారా చాట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. మీ ఇష్టమైన యూజర్‌నేమ్‌ను రిజర్వ్ చేసుకోవడం ద్వారా ప్రైవసీ ఎక్కువగా కాపాడవచ్చు.
Q2. యూజర్‌నేమ్ కోసం ఏ నియమాలు పాటించాలి? A2. యూజర్‌నేమ్ “www.” తో ప్రారంభం కాకూడదు. కనీసం ఒక అక్షరం ఉండాలి; కేవలం నంబర్లు లేదా సింబల్స్ మాత్రమే ఉండకూడదు. చిన్న అక్షరాలు (a–z), సంఖ్యలు (0–9), పీరియడ్స్ (.), అండర్‌స్కోర్లు (_) మాత్రమే అనుమతించబడతాయి.
Q3. యూజర్ “కీ” అంటే ఏమిటి? A3. “కీ” అనేది ఒక సెక్యూరిటీ ఫీచర్. ఎవరు మీ యూజర్‌నేమ్ ద్వారా మీకు మెసేజ్ చేయాలో దీని ద్వారా మీరు నిర్ణయించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా అనవసరమైన మెసేజ్‌లను తగ్గించవచ్చు.
Q4. WhatsApp Update లో మెసేజ్ ట్రాన్సలేషన్స్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?
A4. మీకు తెలియని భాషలో మెసేజ్ వస్తే, దానిపై లాంగ్ ప్రెస్ చేసి ‘Translate’ ఆప్షన్ సెలెక్ట్ చేయవచ్చు. దాని ద్వారా మన బాష లోకి వేరే వాళ్ళు పంపిన మెసేజ్ ని ట్రాన్సలేట్ చేసుకోవచ్చు .
Q5. మెసేజ్ అనువాదం ఫీచర్ ఏ భాషల్లో అందుబాటులో ఉంది? A5.ఆండ్రాయిడ్ యూజర్స్ కి అయితే ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ మరియు అరబిక్ లాంటి 6 బాషలలో iPhone యూజర్స్ కి 21 భాషల్లో ప్రారంభమవుతుంది.
నేను దామోదర్ మండల, ఒక తెలుగు టెక్ బ్లాగర్‌ని. మొబైల్ రివ్యూలు, టిప్స్ , టెక్ ఎడ్యుకేషన్ కంటెంట్‌ను సులభమైన తెలుగు భాషలో రాస్తున్నాను. టెక్నాలజీని అందరికీ సులభంగా అర్థమయ్యేలా చేయడం నా లక్ష్యం.